News
News
వీడియోలు ఆటలు
X

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh : బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మనుషులు మూడు రాజధానుల శిబిరంపై దాడి చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు.

FOLLOW US: 
Share:

MP Nandigam Suresh : అమరావతి ఉద్యమం 1200వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేత సత్యకుమార్ రైతులకు సంఘీభావం తెలిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో మూడు రాజధానుల మద్దతుదారులు సత్యకుమార్ కారుపై దాడిచేశారు. వైసీపీ కార్యకర్తలే తన కారుపై దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. ఈ దాడిపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. మూడు రాజధానుల శిబిరంలో ఉన్న వాళ్లపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మనుషులు దాడి చేశారని ఆరోపించారు. మహిళల మీద ఆదినారాయణ రెడ్డి మనుషులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారన్నారు. అమరావతి రైతుల శిబిరంలో ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. ఆదినారాయణ రెడ్డి అనుచరులు మూడు రాజధానుల టెంట్ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. సత్యకుమార్ కారులో కూర్చొని వెకిలిగా నవ్వారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. 

పోలీసులు ఫిర్యాదు చేస్తాం 

చంద్రబాబు డైరెక్షనులో ఆదినారాయణ రెడ్డి మూడు రాజధానుల శిబిరంపై దాడికి పాల్పడిందని నందిగం సురేష్ అన్నారు. అసలు గొడవకు మూలకారణం ఆదినారాయణ రెడ్డి అన్న ఆయన...సత్యకుమార్ అనవసరంగా ఈ వ్యవహారాన్ని తనపై వేసుకుంటున్నారన్నారు. అమరావతి రైతులు శిబిరం వద్దకు మేమేనాడైనా వెళ్లామా అని పశ్నించారు.  ఈ దాడి పథకం ప్రకారం జరిగిందని, వాళ్లే మనుషులతో వచ్చి కవ్వించారన్నారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చాలన్నారు.  

బీజేపీ నేతలు ఆగ్రహం 

ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సత్యకుమార్ పై జరిగిన దాడిని ఖండించారు. బీజేపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు.  అమరావతి రైతులకు సంఘీభావం తెలిపినందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.  

బహిరంగ దాడులు కలకలం 

అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి వ్యవహరం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. తనపై జరిగిన దాడి ఘటనపై సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో భారతీయ జనతా పార్టికి చెందిన నాయకులు పాల్గొన్నారు. అమరావతి రైతులకు  మద్దతుగా సభలో పాల్గొని ప్రసంగించిన కాషాయ దళం నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి తాను మాట్లాడానని, అయితే అధికారంలో ఉన్న పార్టి నేతలయినా అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడరని సత్యకుమార్ ప్రశ్నించారు. 

Published at : 31 Mar 2023 09:06 PM (IST) Tags: YSRCP AP News satyakumar MP Nandigam Suresh Amaravati Bjp leader Adinarayana

సంబంధిత కథనాలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

టాప్ స్టోరీస్

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా