Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు
Minister Ambati Rambabu : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు ఊతం ఇస్తాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటికైనా రాజధానులపై అభిప్రాయం మార్చుకోవాలని హితవు పలికారు.
Minister Ambati Rambabu : ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్ కు కాస్త ఊరట లభించింది. దీంతో వైసీపీ నేతలు, మంత్రులు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మేం ముందు నుంచీ చెప్తున్నది ఇదే అంటూ వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని మరోసారి స్పష్టం చేశారు. అమరావతి అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజా పరిణామాలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మూడు రాజధానులకు బలాన్ని ఇస్తున్నాయని తెలిపారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదన్నారు. అమరావతి రైతుల యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టే అని పేర్కొన్నారు. అమరావతి గ్రాఫిక్స్ చూపించారు తప్ప రాజధాని నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
చంద్రబాబు, పవన్ తీరు మార్చుకోవాలి
మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆరు నెలల్లో హైకోర్టును కూడా నిర్మించలేరని రాజధాని నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా చంద్రబాబు, పవన్ తీరు మార్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను ఇప్పటికైనా ఆపాలన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పైనా అంబటి తీవ్ర విమర్శలు చేశారు.
రాజధాని నిర్మాణంలో
— Ambati Rambabu (@AmbatiRambabu) November 28, 2022
న్యాయస్థానాల జోక్యం సరైనదికాదని
అత్యున్నత న్యాయస్థానం
చెప్పడం హర్షణీయం!
పవన్ పెద్ద జోకర్
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒక పెద్ద జోకర్ అంటూ మంత్రి అంబటి విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ కు వరుస ప్రశ్నలు సంధించారు. భీమవరం, గాజువాక నుంచి మళ్లీ పోటీ చేస్తానని పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. 25 సీట్ల కన్నా ఎక్కువ చోట్ల పోటీ చేస్తారా? లేక ఎవరితో కలిసి పోటీ చేస్తారో పవన్ చెప్పాలని అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల్లో పెద్ద జోకర్ పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. జనసేనను రౌడీసేన అని వందసార్లు అంటామన్నారు. పవన్ కల్యాణ్‌తో ఎవరైనా వెళితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడమే అంటూ ఎద్దేవా చేశారు.
అమరావతి యాత్రకు శాశ్వత విరామం
"ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారంట. ఏంది స్వామీ నాకు అర్థంకాలేదు. ఆక్రమణదారుల గోడలు పగలగొడితే అది పెద్ద ఉద్యమం. ఇప్పటంలోనే పవన్ కల్యాణ్ అసలు రంగు బయటపడింది. ఇప్పటం చూపించిన తెగువ ఏంటో పవన్ చెప్పాలి. దొంగ సంతకం పెట్టి రూ.14 లక్షలు కోర్టుకు కట్టడం తెగువా. అమరావతిలో రైతులే లేరంటుంటే రైతులు అంటారు పవన్. ఐడీ కార్డులు అడగ్గానే పాదయాత్ర మాయం. రైతుల ముసుగులో జరుగుతున్న యాత్ర అది. అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చారు. పవన్ సినిమాల్లో హీరో రాజకీయాల్లో పెద్ద జోకర్. విశాఖలో రాజధాని పెడితే పవన్, చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? " - అంబటి రాంబాబు