Minister Kodali Nani : నేను పది నాలుగు సార్లు ఫెయిల్, నాపై పోటీ చేసి గెలువు - లోకేశ్ కు మంత్రి కొడాలి సవాల్
Minister Kodali Nani On Lokesh : చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. లోకేశ్ కు దమ్ముంటే గుడివాడలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Minister Kodali Nani On Lokesh : నారా లోకేశ్ కి దమ్ముంటే గుడివాడ(Gudivada)లో పోటీ చేసి గెలవాలని మంత్రి కొడాలి నాని(Kodali Nani) సవాల్ విసిరారు. పదో తరగతి తప్పిన తనపై పోటీ చేసి గెలవాలన్నారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో రెచ్చిపోయారు. 15 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును జగన్ ఒక్క మాట కూడా తులాలేదన్నారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం సరికాదని, అసెంబ్లీకి చట్టం చేసే హక్కు ఉందని సీఎం జగన్(CM Jagan) సభలో చెప్పారే కానీ ఎక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదన్నారు.
"అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయాడు లోకేశ్. నేను నాలుగు సార్లు టెన్త్ తప్పి ఎమ్మెల్యేగా గెలిచా. టీడీపీ(TDP) కోరిక విశాఖపట్నం వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తారు. ఈసారి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు. నేను ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తా టీడీపీ జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా లేకపోతే చంద్రబాబు తప్పుకుంటారా" అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
లోకేశ్ పై తీవ్ర విమర్శలు
శాసనసభకు ఉన్న హక్కులను సీఎం జగన్ సభలో మాట్లాడారని మంత్రి కొడాలి నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సీఎం వివరించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు, ఛీప్ లిక్కర్ తెచ్చిన ఘనత చంద్రబాబే దక్కుతుందన్నారు. ఏ విషయం లేనట్లు ఛీప్ లిక్కర్ అంటూ సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేసిందన్నారు. లోకేశ్ సీఎంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ముఖ్యమంత్రి పదో తరగతి ఫెయిల్ అయ్యారని, ఇంకా తీవ్రంగా మాట్లాడరన్నారు. అయితే లోకేశ్(Lokesh) లాగా సీఎం జగన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదన్నారు. తాత, తండ్రి ముఖ్యమంత్రులు అని డప్పు కొట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి లోకేశ్ అని విమర్శించారు. బాబాయిని చంపి రాజకీయ లబ్ది పొందుతున్నారని విమర్శిస్తున్న లోకేశ్.... తండ్రి చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని మర్చిపోరాయా అని ప్రశ్నించారు.
సోనియా గాంధీకి ఎదురునిలిచిన వ్యక్తి జగన్
సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబే వణికిపోయారని మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటి సోనియా గాంధీకి ఎదురునిలిచి పార్టీ పెట్టిన జగన్ ఇవాళ సీఎం అన్నారన్నారు. 16 నెలలు జైలులో ఉండి కాంగ్రెస్(Congress) ని ఎదురించి ఇవాళ 151 సీట్లు సాధించారన్నారు. టీడీపీని ఎన్టీఆర్(NTR) నుంచి దొంగలించిన చంద్రబాబు, అతని కుమారుడు లోకేశ్ జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేశ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.