అన్వేషించండి

Amaravati News : అమరావతి రైతులకు హైకోర్టులో షాక్ - ఆర్ 5 జోన్‌పై పిటిషన్ తిరస్కరణ !

Amaravati News :  అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఆర్ 5 జోన్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Amaravati News :  అమరావతిలో  ఆర్-5 జోన్‌ అంశంపై రైతులు దాఖలు చేసిన  పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.  ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు  నిరాకరించింది. దీంతో రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని ఇంతకు ముందు అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి..  రాజధాని అవసరాల కోసమే తాము ఇచ్చిన భూముల్ని ఇతరులకు రాజకీయ కారణాలతో పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.                   
  
అమరావతిలో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో కీలక నిర్మాణాలు ప్రతిపాదించిన చోట విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇందు కోసం  సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది ప్రభుత్ం.  తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో  1134 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.                           

 ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.   ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇవ్వగా.. దీనిపై  రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో  ఆర్‌-5 జోన్‌తో రాజధాని భూములను ఇతరులకు కేటాయించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమం అయినట్లయింది.  రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని గతంలో హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పులో పేర్కొంది. కోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది.. చట్టాల్లో మార్పు చేసిందని రైతులు హైకోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది.                                    

మే 9 వతేదీన సుప్రీంకోర్టులో అమరావతి అంశంపై విచారణ జరగనుంది.  మే 9న జరిగే విచారణ కేవలం చనిపోయిన ప్రతివాదుల స్థానంలో వారి వారసులను చేర్చడం మాత్రమే జరుగుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఆర్ 5 జోన్ అంశంపై కూడా రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానికి గతంలోనే  రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు హైకోర్టు రైతుల పిటిషన్ తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.                                                          

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Embed widget