By: ABP Desam | Updated at : 17 Jul 2022 11:19 PM (IST)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్
Har Ghar Tiranga : వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూదిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ సందర్భంగా ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏపీలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని, దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు రూపకల్పన, ఆగష్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరణకు ప్లాన్ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
ఘనంగా హర్ ఘర్ తిరంగా
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. పలు ప్రభుత్వ విభాగాలతో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించామని సీఎం జగన్ తెలిపారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించామన్నారు. ర్యాలీలు, సైకిల్‌ర్యాలీలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పోస్టర్లతో పాటు పలు కథనాలు కూడా ప్రచురించామన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా
Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై
National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్
EX MLC Annam Satish: రూపాయి పెట్టి వంద దోచుకుంటున్నారు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిపై అన్నెం సతీష్ ఫైర్
Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు
Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం
INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది