MP GVL On Bus Yatra : ఏపీలో ఒకే సామాజిక వర్గం చేతిలో అధికారం, మంత్రులకు వారి శాఖల పేర్లు కూడా తెలీదు - ఎంపీ జీవీఎల్

BJP MP GVL On Ministers Bus Yatra : ఏపీలో మంత్రులకు వాళ్ల శాఖలు కూడా సరిగ్గా తెలియవని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు. అధికారం మాత్రం ఆ ఐదుగురి చేతుల్లో మాత్రమే ఉందన్నారు.

FOLLOW US: 

BJP MP GVL On Ministers Bus Yatra : ప్రజలను మభ్యపెట్టటానికే మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర(Bus Yatra) చేపట్టారని బీజేపీ ఎంపీ జీవీఎల్(MP GVL) ఆరోపించారు. వాళ్లు మంత్రులవగానే సామాజిక న్యాయం జరిగిపోతుందా? అని ప్రశ్నించారు. అసలు బస్సెక్కిన మంత్రులకు తమ శాఖ ఏదో, అందులో ఏం జరుగుతోందో తెలుసా? అని నిలదీశారు. ప్రజలకు కాదు కదా పత్రికల వారికి కూడా ఉప ముఖ్యమంత్రుల, వారి శాఖల పేర్లు తెలీని పరిస్థితి ఉందన్నారు. శ్రీకాకుళంలో బస్సు యాత్ర సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Seetharam) చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీలో అధికారం చెలాయిస్తున్న ముఖ్యమైన ఐదుగురి పేర్లు చెప్పమంటే అన్నీ ఒకే సామాజిక వర్గానివే ఉన్నాయన్నారు. మిగతాదంతా ఉత్తుత్తి సాధికారతే అని ఆరోపించారు. 

బీసీ కార్పోరేషన్ల నిధులు మళ్లింపు

బీసీ కార్పోరేషన్లు(BC Corporation) అన్ని కులాలకు పెట్టారు గానీ వాటికి నిధులు కాదు కదా కనీసం ఆఫీసులు లేవని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వాటికి బడ్జెటు(Budget)లో కేటాయించిన అరకొర నిధులు కూడా నవరత్నాలకు తరలించేశారన్నారు. రాజకీయ అధికారమంతా సీఎం గుప్పిట్లో పెట్టుకుని బీసీ మంత్రులను(BC Ministers) ఇలా తిప్పటానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి సామాజిక న్యాయం చేయగలవా? అని నిలదీశారు. కుటుంబ పాలన సాగిస్తూ సామాజిక న్యాయం అంటే మోసం చేయటం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవైనా, ప్రధాని, ముఖ్యమంత్రి పదవులైనా సమర్ధుడైన ఏ కార్యకర్త అయినా చేపట్టే అవకాశం బీజేపీలో ఉంటుందన్నారు. కేంద్రం బీసీ జాతీయ కమిషన్ కు చట్టబద్ధమైన, రాజ్యాంగ పరమైన అధికారాలు ఇచ్చిందన్నారు. 

దావోస్ లో ఏం సాధించారు? 

" దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ఏం సాధించారో చెప్పాలి. తెలంగాణ మంత్రి జగన్ అక్కడ దోమలు తోలుకుంటున్నారని వ్యాఖ్యానిస్తే ఇక్కడి నుంచి ఒక్క ఖండన ఇవ్వలేకపోయారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని క్రేన్లు, బుల్డోజర్లూ కూడా పైకి ఎత్తలేవని సామాన్యులకు సైతం అర్థమైంది. పొరుగునున్న తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) నిన్న ప్రధాని పాల్గొన్న సభలో జాతీయ అధికార భాషగా తమిళాన్ని గుర్తించాలన్నారు. దేశంలో ఏ భాష తక్కువ? అన్నీ గొప్ప భాషలే. బీజేపీ జాతీయ భావనతో దేశంలోని అన్ని భాషలనూ మాతృభాషలుగా అభివృద్ధి చేయాలంటోంది. స్టాలిన్ మాత్రం భాషా రాజకీయాలు నడపాలని చూస్తున్నారు. ఇక్కడ ఏపీలో మాత్రం జగన్ సర్కారు తెలుగును కాదని ఆంగ్ల బోధన అంటోంది. అది సరికాదని బీజేపీ(BJP) చెప్పింది. తెలుగు(Telugu)ను బోధన భాషగా కొనసాగించాలి. "
--జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ

చంద్రబాబు, జగన్ కుట్ర 

అమలాపురం గొడవలకు విపక్ష చంద్రబాబు, అధికారపక్ష జగన్ ల ఓటు బ్యాంకు(Vote Bank Politics) పోటీ రాజకీయాలే కారణమని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు అంబేడ్కర్ కోనసీమ జిల్లా(Konaseema)4గా పేరు మార్చాలన్నారన్నారు. వెంటనే జగన్ అమలు చేసేశారని పేర్కొన్నారు. ముందస్తు అభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఒకపక్క పేరు పెట్టి మరోపక్క అల్లరి మూకలను అదుపు చేయకుండా వదిలేశారన్నారు. ఇరు వర్గాల ఓట్ల కోసమే ఈ రాజకీయం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్, ఇద్దరూ ఈ అల్లర్లకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన తమ్ముడు జగన్ కు మద్దతిస్తారా? ప్లేటు ఫిరాయిస్తారా? చెప్పాలన్నారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు బీజేపీకి ప్రమేయం లేదని పేర్కొన్నారు. హింసకు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బీజేపీ మద్దతు ఉండదన్నారు. 

Published at : 27 May 2022 04:10 PM (IST) Tags: AP News Amaravati News GVL Narasimha Rao BJP MP Ministers bus yatra

సంబంధిత కథనాలు

Chintamaneni Reaction: కోడిపందేల ఘటనలో ఎస్కేప్ ఆరోపణలపై చింతమనేని రియాక్షన్, ఏమన్నారంటే

Chintamaneni Reaction: కోడిపందేల ఘటనలో ఎస్కేప్ ఆరోపణలపై చింతమనేని రియాక్షన్, ఏమన్నారంటే

Nellore Woman Protest: ఆ లీడర్స్ పేర్లు బయటపెట్టి సూసైడ్ చేసుకుంటా! మహిళా ఉద్యోగి నిరసన

Nellore Woman Protest: ఆ లీడర్స్ పేర్లు బయటపెట్టి సూసైడ్ చేసుకుంటా! మహిళా ఉద్యోగి నిరసన

Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో ఘోరం, మహిళను ఢీకొట్టిన కారు - రివర్స్ తీసుకొని మరీ

Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో ఘోరం, మహిళను ఢీకొట్టిన కారు - రివర్స్ తీసుకొని మరీ

Naga babu Satires: భీమవరం సభపై నాగబాబు రియాక్షన్, అన్నయ్య చిరుని తప్పించి అందరికీ కలిపి ఒకే సెటైర్!

Naga babu Satires: భీమవరం సభపై నాగబాబు రియాక్షన్, అన్నయ్య చిరుని తప్పించి అందరికీ కలిపి ఒకే సెటైర్!

Vijayamma To YSRCP Plenary: వైసీపీ ప్లీన‌రికి విజ‌య‌మ్మ‌ వ‌స్తారా? లేదా? జ‌గ‌న్ పాల‌నపై ఆమె ఏమంటారు?

Vijayamma To YSRCP Plenary: వైసీపీ ప్లీన‌రికి విజ‌య‌మ్మ‌ వ‌స్తారా? లేదా? జ‌గ‌న్ పాల‌నపై ఆమె ఏమంటారు?

టాప్ స్టోరీస్

Thor Love and Thunder Review: థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?

Thor Love and Thunder Review: థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?

Bandi Vs KCR : తెలంగాణలో "లెక్క"లు మారుతాయా? ఎవరి అవినీతి ఎవరు వెలికి తీస్తారు?

Bandi Vs KCR : తెలంగాణలో

Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్

Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్

Corona Cases: దేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్- తాజాగా 18,930 మందికి కరోనా

Corona Cases: దేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్- తాజాగా 18,930 మందికి కరోనా