Amalapuram KIMS : కిమ్స్ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
Amalapuram KIMS : అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలకు చెందిన 50 మంది వైద్య విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలు అయ్యాయని విద్యార్థినులు తెలిపారరు.
Amalapuram KIMS : కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. కిమ్స్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినులకు పుడ్ పాయిజన్ అయింది. విషయం బయటకు రాకుండా కిమ్స్ యాజమాన్యం గోప్యంగా ఉంచారు. గతంలో కూడా ఇలా జరిగినప్పటికీ యాజమాన్య తీరులో మార్పు రాలేదు. సుమారు 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది విద్యార్థినులు డిశ్చార్జ్ అయ్యి ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ కాగా కొంతమంది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆందోళనలో తల్లిదండ్రులు
ఈ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో తమ పిల్లలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఆసుపత్రికి తరలివస్తున్నారు. పుడ్ పాయిజన్ కు గురైన వారిలో అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల డెంటల్, నర్సింగ్, మెడికల్ సంబందించి కొందరు విద్యార్థినులు ఉన్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ లో భోజనం చేసిన తరువాత అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు తెలిపారు.
Also Read : First Night Fear : శోభనం భయంతో ఆత్మహత్య - తల్లి, ఫ్రెండ్స్ ఎంత ధైర్యం చెప్పినా !?
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. పాఠశాలలో పెట్టే ఆహారం బాగోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట సరిగా చేయడంలేదని, తినలేకపోతున్నామని అధికారులకు తెలిపారు. తరచూ వాంతులు అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వంట చేసే వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు అంటున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని తమను వేధింపుల నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఉపాధ్యాయులు పట్టించుకోవడంలేదంటున్నారు.
Also Read : Vijayawada GGH Incident : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అత్యాచారం!