అన్వేషించండి

Amalapuram BRS Banners : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, అమలాపురం ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

Amalapuram BRS Banners : అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. జై బోలో జై కేసీఆర్ అనే నినాదాలతో ఎంపీ అభ్యర్థి అంటూ వెలిసిన ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

Amalapuram BRS Banners : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఉంటే ఎవరికి పగ్గాలు అప్పగిస్తారనే చర్చల మధ్య అమలాపురం బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు స్థానికంగా చర్చినీయాంశమయ్యాయి. ఉద్యమాల వేదిక అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలో జై బోలో.. జై కేసీఆర్... అన్న నినాదాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ పేరుతో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి రేవు అమ్మాజీరావు డబల్ ఎంఏ పేరు మీద రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గడియార స్తంభం ముందున ఇనుప గ్రిల్స్ కు  కట్టిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపాయి. 

అమలాపురంలో ఫ్లెక్సీల కలకలం 

కోనసీమ జిల్లా అమలాపురంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. రేవు అమ్మాజీరావు పేరుతో రెండు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. పార్టీ పేరు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీలో బ్యానర్లు వెలవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  కోనసీమలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే చర్చ అప్పట్లో నడిచింది. తాజాగా బీఆర్ఎస్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కలకలం రేగుతోంది. కనీసం బీఆర్ఎస్ పేరు మార్పు ప్రక్రియ పూర్తి కాక ముందే తాను ఎంపీ అభ్యర్థినంటూ ప్రకటించుకోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ అంశంపై ఎవరూ స్పందించలేదు. ఆ పార్టీ నాయకులకు తెలిసే ఈఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా, లేదా ఎవరైనా  రాజకీయ వ్యూహాంతో ఇలా చేశారా అనే సందేహాలు వస్తున్నాయి. బీఆర్ఎల్ పార్టీ ఫ్లెక్సీలు ఏపీలో ఏర్పాటు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్న విషయం తెలుసుకోవడానికి కూడా ఎవరైనా ఈ ఫ్లెక్సీలు కట్టారా అనే అనుమానాలను కూడా లేకపోలేదు. 

కేసీఆర్ తాత వచ్చినా మాకేం కాదు-కారుమూరి 

 బీఆర్ఎస్ పార్టీపై ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పై తాజాగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదంటున్నారు. జగన్ సింహం, సింహం సింగిల్ గా వస్తుందన్నారు. వైసీపీ ఓటు బ్యాంకుకు వచ్చిన నష్టం ఏంలేదని మంత్రి కారుమూరి అన్నారు. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ వర్గీయుల భార్యలతో పాదయాత్ర చేయిస్తున్నారు. దమ్ముంటే వాళ్ల భర్తలను ముందుకు రమ్మనండి ముసుగులు తొలగిపోతాయంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. 

ఏపీలో ఏ అజెండా 
 
 సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో అరంగ్రేటం చేస్తున్నామని తెలిపారు. ముందుగా కర్ణాటక, మహారాష్ట్రలో బీఆర్ఎస్ యాక్టివిటీ ప్రారంభిస్తామని కేసీఆర్ వెల్లడించారు. దశలవారీగా దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామన్నారు. అయితే కేసీఆర్ కొత్త పార్టీ ఏపీలో పోటీ చేస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ ఏ అజెండాతో ఏపీలో పోటీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరో ప్రతిపక్ష పార్టీ - మంత్రి బొత్స 

బీఆర్ఎస్ పై బీజేపీ నేత జీవీఎల్ స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ రావాలన్నారు. ఆ పార్టీని ప్రశ్నిస్తామంటూ జీవీఎల్ కామెంట్స్ చేశారు. అధికార వైసీపీ కూడా బీఆర్ఎస్ పై ఎదురుదాడి స్టార్ట్ చేసింది. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికార పార్టీపై ప్రతిపక్షాల ప్రభావం ఎలా ఉందో, బీఆర్ఎస్ కూడా అలాంటి ప్రభావాన్నే చూపిస్తుందన్నారు. రాజకీయాల్లో పోటీ ఉంటేనే బాగుంటుందని మంత్రి తెలిపారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget