Tenali Politics : తెనాలిలో వెనక్కి తగ్గని ఆలపాటి రాజా - పాదయాత్ర ! జనసేనతో చిక్కులు తప్పవా ?
Tenali Seat : తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం ఉన్నా టీడీపీ నేత ఆలపాటి రాజా పాదయాత్ర చేస్తున్నారు. దీంతో ఈ సీటుపై రెండు పార్టీల్లో వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
Alapati Raja : టీడీపీ, జనసేన మధ్య పొత్తులో మొదటగా తెనాలి సీటును టీడీపీ వదులుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ నెంబర్ టు నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం అదే. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 30 వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. కానీ అక్కడ టీడీపీ బలంగా ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని పని చేసుకుంటున్నారు. ఆయన సీటును త్యాగం చేయడనికి సిద్ధంగా లేరు.
నాదెండ్ల తెనాలి అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్
తెనాలిలో జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దాదాపు ఆరు నెలల క్రితమే ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు.టిడిపి టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సిద్ధమవుతున్నట్టు ప్రచార ం జరుగుతోంది. టిడిపి నుంచి ఇప్పటి వరకు సీట్ల కేటాయింపుపై ఎలాంటి ప్రకటన రాకపోయినా నాదెండ్ల మనోహర్ ఇప్పటికే జనసేన అభ్యర్థిగా ప్రచారంలో ఉండటం, ఆలపాటికి ప్రత్యామ్నాయం గురించి టిడిపి అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఆలపాటి గ్రూపు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తూ ప్రతిపక్షంలో చురుకైనపాత్ర పోషిస్తున్నా ప్రాతినిధ్యం కల్పించకపోతే ఎలాగని టిడిపి శ్రేణులు అంటున్నాయి.
అనుచరులతో వరుస సమావేశాలు
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గత మూడు రోజులుగా వరుసగా అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటికి ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పారు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని వారికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సర్ది చెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని చెప్పారు. తర్వాత తెనాలిలో టిడిపి కార్యకర్తలతో రాజేంద్రప్రసాద్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నాదెండ్ల మనోహర్ కు కేటాయించవద్దని డిమాండ్ డిమాండ్
తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్న ఇరు పార్టీలు
టిడిపి నిర్వహించిన సర్వేలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు గెలుపు అవకాశాలున్నాయని నివేదికలొచ్చినట్లు చెబుతున్నారు. అయితే జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తరువాత అన్ని తానై చూస్తూ నంబరు-2గా పేరొందిన నాదెండ్ల మనోహర్‌కే ఆదిలోనే సమస్యలు ప్రారంభం అయ్యాయి. టిడిపి, జనసేన పొత్తుపై ఎన్నికలకు ముందుగానే అంతర్గత కలహాలు పెరుగుతుండటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా చోటుచేసుకుంటాయోనే ఉత్కంఠ నెలకొంది.