అన్వేషించండి

Agnipath Protests Telugu Live Updates: నాలుగో ట్వీ20లో భారత్ ఘన విజయం 

Breaking News Telugu Live Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.

Key Events
Agnipath Protests ED Raids JC Brother Residence AP Telangana Breaking News Telugu Live Updates Agnipath Protests Telugu Live Updates: నాలుగో ట్వీ20లో భారత్ ఘన విజయం 
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

గత ఏడాదితో పోల్చితే వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షాలు ఇంకా మొదలుకాకపోవడంతో ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.  రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి.

సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించేందుకు యవతకు రక్షణ శాఖ ఇచ్చిన అవకాశం అగ్నిపథ్ పథకం. నాలుగేళ్ళపాటు దేశానికి సేవలందించడానికి అగ్నివీరులను నియమించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించడం తెలిసిందే. తాజాగా యువతకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. 'అగ్నిపథ్'  పథకంలో భాగంగా ఆర్మీలో చేరి సేవలు అందించనున్న అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇందులో చేరేందుకు గరిష్ట వయో పరిమితి 23కి చేరింది.  పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల వయసుగల వారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు.

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 17th June 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 17th June 2022) లీటర్ ధర రూ.111.57 కాగా, 19 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.33 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. 50 పైసలు పెరగడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.28 అయింది. డీజిల్‌పై 46 పెరగడంతో లీటర్ ధర రూ.99.01 అయింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids At JC Prabhakar Reddy Home) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈడీ తనిఖీలు చేపట్టిన సమయంలో జేసీ  సోదరులు ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు ప్రారంభించిన ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి మొబైల్స్‌తో పాటు వారి కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డిఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది.

హైదరాబాద్‌లోని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల్లోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలోని కాంట్రాక్టర్‌ గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ తనిఖీల నేపథ్యంలో వీరి నివాసాలను సమీపంలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏకకాలంలో జేసీ బ్రదర్స్ ఇళ్లు, ఆస్తులపై ఈడీ సోదాలు చేపట్టగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

22:36 PM (IST)  •  17 Jun 2022

నాలుగో ట్వీ20లో భారత్ ఘన విజయం 

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ భారత్ ను 2-2తో సమం చేసింది. వరసగా రెండో విజయం సాధించి సిరీస్ లో ఆశలు సజీవం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 169/6 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.5 ఓటర్లలో 87/9 స్కోరుకే పరిమితం అయింది. దీంతో భారత్ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా(8) రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు. 

18:28 PM (IST)  •  17 Jun 2022

హైదరాబాద్ మెట్రో రైళ్లు పునరుద్ధరణ 

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దీంతో రైళ్ల పునరుద్ధరణకు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే నగరంలో నడిచే మెట్రో రైళ్ల పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6.35 నుంచి మెట్రో రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget