Kaikala On Jagan : వైద్య ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు.. ఏపీ సీఎం జగన్‌కు కైకాల లేఖ !
ఆస్పత్రిలో ఉన్న సమయంలో వైద్య సాయానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు లేఖ రాశారు.
అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు చెబుతూ నటుడు కైకాల సత్యనారాయణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. నవంబర్‌లో కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వచ్చారు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా సీఎం జగన్‌కు లేఖ రాశారు.
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల చాలా సంతోషించానని కైకాల తెలిపారు. ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా వచ్చి కలిశారని.. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయంతో పాటు అన్ని రకాల సహాయాన్ని అందించారన్నారు. కష్ట సమయాల్లో సీఎం సహాయం తనకు, తన కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
జగన్ తనపై చూపిన శ్రద్ధ కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల లేఖలో పేర్కొన్నారు. లేఖలో జగన్‌కు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు. తాను సంతకం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని అందుకే తన కుమారుడు సంతకం చేశారని తెలిపారు.
Also Read: ఆస్పత్రిలో కైకాల... ఆందోళన లేదన్న కుటుంబ సభ్యులు
తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి లేఖలో కృతజ్ఞతలు చెప్పారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వైద్య ఖర్చులను కూడా ఏపీ ప్రభుత్వం భరించింది. అప్పుడు సీతారామ శాస్త్రి కుటుంబం కూడా సీఎం జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాసింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి