అన్వేషించండి

పోలీసులతో నిందితుడి ఫ్రెండ్‌షిప్‌- అంధురాలి హత్య కేసులో కొత్త కోణం!

ఆంధ్రప్రదేశ్‌లో హైసెక్యూరిటి జోన్ అది. ఏపీలో ఎక్కడా లేని పోలీస్ భద్రత అక్కడే ఉంటుంది. కానీ అత్యంత కిరాతకంగా అంధురాలి హత్య జరిగిపోయింది. దీంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తాడేపల్లి ప్రాంతంలో అత్యంత ఘోరమైన హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి అత్యంత సమీపంలో అంధురాలిని హత్య చేశాడు నిందితుడు రాజు. దీంతో పోలీసుల పని తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన పోలీసు నిఘా ఉండే ప్రాంతంలోనే అంధురాలై బాలిక హత్యకు గురైంది. నిందితుడు పట్టపగలు ఇంట్లోకి వెళ్లి అత్యంత కీరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రతిపక్షాలు పోలీసులు, ప్రభుత్వం వైఫల్యంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. అంటే ఇద్దరు కీలక నేతలు ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నా ఇలాంటి ఆరోపణలు రావటంపై సర్వత్రా చర్చనీయాశంగా మారింది.

సీఎం నివాసానికి సమీపంలో ఘటన...

ఏపీలో రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో తెలియదు. తాజాగా సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే రాణి అనే అంధురాలి హత్య వ్యవహరం తీవ్ర దుమారాన్ని రాజేస్తోంది. పోలీసులు నిర్లక్ష్యం వలనే ఒక నిండు ప్రాణం బలి అయ్యింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పెనుమాక, కుంచనపల్లికి చెందిన ఇద్దరు చదువుకునే విద్యార్థులను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయాన్ని స్థానికులు ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు వచ్చి తీసుకెళ్లే వరకు కూడా తాడేపల్లి పోలీసులు నిద్రావస్థలో ఉన్నారా అనే విమర్శలను తాడేపల్లి పోలీసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాడేపల్లి పోలీసులు నిఘా లోపించడం వలనే హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారా అంటూ రాజకీయంగా విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.

స్టేషన్ పరిధిలో సిబ్బంది ఫుల్ అయినా 

తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉన్నప్పటికీ నిఘా లోపాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం వద్ద జరిగిన ఈ ఘటనతో తాడేపల్లిలో నిఘా వైఫ్యలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. నిఘా వర్గాలు సైతం సరిగ్గా పని చేయడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాయి, రౌడీ షీటర్లపై నిఘా లేకపోవటంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి స్టేషన్‌లోని పోలీసులు, నిఘా వర్గాలు ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహించడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే విమర్శ కూడా ఉంది. 

నిందితుడితో పోలీసులకు ఫ్రెండ్ షిప్..

అంధురాలు హత్య కేసులో నిందుతుడు కుక్కల రాజుకు కొందరు పోలీసులతో స్నేహా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు కుక్కల రాజు మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పొలీసుల భయం ఉంటే నిందితుడు రాజు ఈ హత్యకు పాల్పడి ఉండే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు.

వీవీఐపీ జోన్‌లో పోలీసులపై ఒత్తిడి...

తాడేపల్లి పోలీస్ స్టేసన్ ఇప్పుడు వీవీఐపీ జోన్‌లో ఉంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేసే సిబ్బందితోపాటుగా, అదనంగా వందల సంఖ్యలో పోలీసులు నిత్యం విధులు నిర్వర్తిస్తారు. అయితే వారంతా కేవలం వీవీఐపీ సేవలోనే ఉంటారు. స్థానికంగా శాంతి భద్రతల వ్యవహరం కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, ఎదైనా అనుకోని ఘటన జరిగినా ఎదుర్కోవటానికి కానీ కనీసం ప్రయత్నించరు. దీంతో వీఐపీ జోన్‌లో ఏది జరిగినా పోలీసులపై ఒత్తిడి పెద్ద ఎత్తున పెరిగిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget