Sathya Sai Auto Accident Update : ఉడుతకు పోస్టుమార్టం - సజీవ దహనం ప్రమాదానికి కారణం తేల్చే పనిలో అధికారులు !
సత్యసాయి జిల్లాలో సజీవ దహనం ప్రమాదంలో ఉడతదే తప్పని నిరూపించేందుకు ఆ ఉడతకు పోస్టుమార్టం నిర్వహించారు.
Sathya Sai Auto Accident Update : ఉడతకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఉడతకు పోస్ట్ మార్టం ఎందుకంటే సత్యసాయి జిల్లాలో జరిగిన హైటెన్షన్ వైర్ ప్రమాదానికి కారణం ఉడుతేనని విద్యుత్ శాఖ అధికారులు మొదటగానే ప్రకటించారు. దీంతో అటు రాజకీయ పార్టీలు.. ఇటు సోషల్ మీడియాలో కూడా విద్యుత్ అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఉడత తెంచేంత బలహీనంగా విద్యుత్ వైర్లు ఉన్నాయా...? అంటూ ప్రతిపక్ష నాయకుల చేసిన విమర్శలను తిప్పి కొట్టే పనిలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతిపక్షాల నోరు ముయించడంలో భాగంగా ఉడతకు పశువైద్యులతో శవపరీక్ష నిర్వహించింది ప్రభుత్వం. అయితే శవ పరీక్షలలో తేలిన విషయాలను వెల్లడించేందుకు పశువైద్యాధికారులు నిరాకరించారు.
ఉడుతకు పోస్ట్ మార్టం నిర్వహించిన పశువైద్యులు
చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో అందరి దృష్టిని ఉడత శవరపరీక్ష ఆకర్షిస్తోంది. ఉడత కారణంగానే సజీవ దహనం జరిగినట్లు నిరూపించే పనిలో అటు విద్యుత్ శాఖ అధికారులు ఇటు ప్రభుత్వాధికారులు ఉన్నారని అందుకే ఉడతకు శవ పరీక్ష నిర్వహించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హై టెన్షన్ వైర్లు మెషిన్‌తో కట్ చేసినా తెగనంత గట్టిగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా అధికారులు ఉడత వల్లనే తెగిపోయానని ఎలాంటి విచారణ లేకుండా ప్రకటించారు.
3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దు - రఘురామకు రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు
తప్పు ఉడుతదేనని తేల్చబోతున్నారా ?
అదే సమయంలో తెగిన హైటెన్షన్ వైర్ స్తంభంపై ఓ ఉడత చనిపోయి పడి ఉంది. దీంతో ఆ ఉడత వల్లనే తీగలు తెగిపోయానని విద్యుత్ అధికారులు చెబుతున్నట్లుగా గుర్తించి .. ఉడత మృతదేహాన్ని భద్రపరిచారు. ఇవాళ శవపరీక్ష నిర్వహించారు. ్యితే చేయాల్సింది ఉడతకు శరవరీక్ష కాదని.. విద్యుత్ తీగల నాణ్యాతా పరీక్ష అని నిపుణులు చెబుతున్నారు. అంత నాసిరకంగా ఉన్నాయా లేదో నిపుణుల చేత వైర్లను పరీక్షింప చేయాలంటున్నారు.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!
వైర్ల నాణ్యతను పరీక్షించరా ?
ఎందుకుతెగిందో తేల్చాలి కానీ ఉడత వల్ల తెగిందని చెప్పడం ఏమిటని విస్మయానికి గురవుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ నడుస్తోంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఉడత వల్లనే తీగ తెగిందని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు బయటకు వస్తేనే పశువైద్యులు ఏం తేల్చాలో స్పష్టత రానుంది.