YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
నూతనంగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనుకున్న సమయంలో పరిశ్రమలు ఏర్పాటు కావటానికి , ప్రభుత్వం యాజమాన్యాలకు చేదోడుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్...
ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తి చేసిన, అవి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలన్న ముఖ్యమంత్రి, రానున్న ప్రతి పరిశ్రమలో ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం...
కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్ మరియు ఫ్యూయెల్స్ కంపెనీ ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలిపారు. రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి, రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం గల కంపెనీ నిర్మాణ పనులను ఈ ఏడాది జూన్ లో ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు, కాగా, ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు,లభిస్తాయని, 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎనర్జీ పార్క్ ఏర్పాటు...
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్
మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి.
మొత్తం కలిపి రూ.1,10,000 కోట్ల పెట్టుబడికి యాజమాన్యం ముందుకు వచ్చింది.ఫేజ్ వన్‌లో 30 వేలమందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పార్క్ లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు లభించనున్నాయి.మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 2033 నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టారు.ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ఎన్టీపీసీ ముందడుగు వేస్తోంది.
అంతే కాదు,శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నారు.డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ, శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు.మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.దీని వలన ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ...
రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ కి రూ. 10వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. కాపర్ కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫూరిక్ యాసిడ్, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ జరుగుతుంది. ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మే 2023లో ప్రారంభమై, జూన్2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టారు.