అన్వేషించండి

Top Headlines: కాకినాడ సెజ్, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్ - ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Head lines In AP And Telangana:

1. కాకినాడ సెజ్, పోర్టు కేసుపై కీలక అప్‌డేట్

కాకినాడ సెజ్‌, పోర్టు కేంద్రంగా నమోదైన కేసులు వైసీపీ నేతల మెడకు గట్టిగా చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. కేవీ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ విదేశాలకు పారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడి బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇంకా చదవండి.

2. యాగంటి క్షేత్రంలో తీవ్ర విషాదం

అనంతపూర్ జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) తన 10 మంది స్నేహితులతో కలిసి యాగంటి విహారయాత్రకు వచ్చాడు. దర్శనం అనంతరం యాగంటిలోని పెద్ద కోనేరులో స్నేహితులతో ఈత కొట్టాడు ఈ సరదాలోనే ఓ పందెం వేసుకున్నారు. అదే అతని ప్రాణం తీసింది. అప్పటి వరకు ఈత కొట్టిన స్నేహితులంతా నీటిలో మునిగే పందెం వేసుకున్నారు. ఎవరు ఎంతసేపు నీటిలో ఉంటారో వాళ్లే విజేత అంటూ పందెం వేసుకున్నారు. సరదాగా అందరూ నీటిలో మునిగారు. నీటిలో మునిగిన సురేంద్ర అనే యువకుడు ఎంతకీ పైకి రాలేదు. ఇంకా చదవండి.

3. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ మంత్రి హరీష్‌రావు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి అభ్యర్థను తోసిపుచ్చింది. అయితే అరెస్టు చేయొద్దని విచారణ మాత్రం చేయాలని ఆదేశించింది. అధికారంలో ఉన్నప్పుడు హరీష్‌రావు ఓ అధికారితో కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులో ఎలాంటి మెరిట్ లేకుండానే తనపై కేసు నమోదు చేశారని వాదించారు. ఇంకా చదవండి.

4. మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్

మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్‌ పోలిస్ స్టేషన్‌లో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో కౌశిక్ రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లిన హరీష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన అనుచరులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్‌రావును అక్కడి నుంచి తరలించేందుకు అరెస్టు చేశారు. ఇంకా చదవండి.

5. వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

ములుగు జిల్లా వాజేడులో ఎస్సై హరీష్ ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. ఓవైపు జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ విషయంపై చర్చ నడుస్తుండగానే ఎస్సై ఆత్మహత్య పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ హైదరాబాద్‌ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మిస్డ్‌ కాల్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ఇప్పుడు ఆయన ప్రాణాల మీదుకు వచ్చిందని అంటున్నారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget