అన్వేషించండి

Today Top Headlines: డ్రోన్ తయారీ హబ్‌గా ఏపీ - హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. డ్రోన్స్ తయారీ హబ్‌గా ఏపీ

డ్రోన్ల త‌యారీ రంగంలో దేశంలోనే ఆంద్ర‌ప్ర‌దేశ్ అత్యత్త‌మ కేంద్రంగా రూపొందించేలా రాష్ట్ర ప్ర‌భుత్వం కృత నిశ్చయంతో ప‌నిచేస్తోందని ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె.దినేష్ కుమార్ అన్నారు. ఇందు కోసం క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లులో (Orvakallu) 300 ఎక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో దేశంలోనే మొట్ట‌మొద‌టి, అతి పెద్ద డ్రోన్ సిటీని (Drone City) ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే అక్క‌డ స్థ‌ల సేక‌ర‌ణ పూర్తి చేశామ‌ని, అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌బోతున్నామ‌ని తెలిపారు. ఇంకా చదవండి.

2. ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా.?

ఎన్టీఆర్‌కు 'భారతరత్న' ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ప్రతిసారి అది వెనక్కిపోతూనే వస్తోంది. రాజకీయంగాను సినిమాపరంగానూ తెలుగువాడి ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఘనంగా చాటిన నందమూరి తారక రామారావుకు ' భారతరత్న' ఇచ్చి గౌరవించాలని పార్టీలు కతీతంగా ప్రతి తెలుగువాడు కోరుతున్నాడు. మరో తెలుగు దిగ్గజం పీవీ నరసింహారావుకు ఆ పురస్కారం దక్కింది. ఇక పెండింగ్లో ఉంది ఎన్టీఆర్ మాత్రమే.1999- 2004 మధ్య కేంద్రంలో టిడిపి చక్రం తిప్పినప్పుడు ఎన్టీఆర్‌కు 'భారతరత్న' సాధించడం వీలుపడి ఉండేదనీ కానీ అప్పట్లో చంద్రబాబు పెద్దగా ప్రయత్నం చేయలేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇంకా చదవండి.

3. రియల్ పొలిటికల్ హీరో స్టోరీ తెలుసా?

ఒక నాయకుడు జనంలోంచి పుడుతాడు... ఇంకో నాయకుడు అణిచివేత నుంచి పడుతాడు.. మరో నాయకుడు పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించాలన్న లక్ష్యంతో పుడుతాడు. కానీ రాయలసీమలో ఒక నాయకుడు మాత్రం ఈ పరిస్థితుల నుంచి పుట్టాడు. ఆయన ఆస్తమించి రెండు దశాబ్ధాలైనా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ధ్వనిస్తున్న నాయకుడే పరిటాల రవీంద్ర. పరిటాల రవి అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఆ పేరు చాలా మందికి వణుకు తెప్పించేది. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపేది.. పేదప్రజల కన్నీరు తుడిచేది.. ఇంకా చదవండి.

4. ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ దావోస్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ ప్రశంసించారు. ఇంకా చదవండి.

5. హన్మకొండ గ్రామసభలో ఉద్రిక్తత

తెలంగాణలో గత 2 రోజులుగా గ్రామసభలు కొనసాగుతుండగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) గ్రామసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేవీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల లిస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అధికారులను ప్రశ్నించారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget