By: ABP Desam | Updated at : 23 Nov 2021 06:15 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 184 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మెుత్తం.. మొత్తం 20,68,672 మందికి కేసులు నమోదయ్యాయి. 20,52,084 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ.. 14,429 మంది మరణించారు. ప్రస్తుతం 2,159 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 23/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 23, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,672 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,084 మంది డిశ్చార్జ్ కాగా
*14,429 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,159#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/C94ILjHxV4
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 7,579 కేసులు నమోదుకాగా 236 మంది మరణించారు. గత 543 రోజుల్లో ఇదే కనిష్ఠం. 12,202 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584 వద్ద ఉంది. గత 536 రోజుల్లో ఇదే అత్యల్పం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
గత 46 రోజులుగా రోజువారీ కేసులు 20వేల కంటే తక్కువే ఉన్నాయి. గత 149 రోజులుగా 50 వేల కంటే తక్కువే ఉన్నాయి. రికవరీ రేటు 98.32గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
కేరళ..
కేరళలో కొత్తగా 5,080 కేసులు నమోదయ్యాయి. 196 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,89,175కు పెరిగింది. మరణాల సంఖ్య 37,495కు చేరింది. గత 24 గంటల్లో 53,892 శాంపిళ్లు పరీక్షించారు.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 873 కేసులు నమోదయ్యాయి. కోజికోడ్ (740), తిరువనంతపురం (621) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మహారాష్ట్రలో 656 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది మృతి చెందారు.
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!
AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!