అన్వేషించండి

Corona Update: ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు.

ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృ  కొవిడ్​తో మరో ముగ్గురు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా నుంచి మరో 162 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,821 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 35,071 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 20,72,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మెుత్తం 14,471 మంది మరణించారు.

దేశంలో కేసులు

దేశంలో కొత్తగా 6,984 కోరనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,10,628కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,562కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • కొత్త కేసులు: 6,984 
  • మొత్తం రికవరీలు: 8,168
  • కొత్త మరణాలు: 247 

మొత్తం మరణాల సంఖ్య 4,76,135కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్​ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది.

ఒమిక్రాన్ కేసులు..

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 50 దాటింది. తాజాగా తెలంగాణలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు.

కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించామని.. ఆమెను చికిత్స నిమిత్తం గచ్చిబౌలి టిమ్స్​ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఒమిక్రాన్‌ సోకలేదని డీహెచ్‌ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమాలియా నుంచి వచ్చిన యువకుడి ఆచూకీని హైదరాబాద్ పారామౌంట్​ కాలనీలో​ పోలీసులు గుర్తించారు. బాధితుడిని నేరుగా టిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.

Also Read: AP High Court: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ

Also Read: AP High Court: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ

Also Read: Tirupati: పాఠాలు చెప్పమంటే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget