Karimnagar: ప్రారంభం కానున్న వరి కోతలు, కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం - సన్న బియ్యానికి డిమాండ్
Telangana Paddy Procurement: ఈ వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
![Karimnagar: ప్రారంభం కానున్న వరి కోతలు, కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం - సన్న బియ్యానికి డిమాండ్ Telangana Government is ready to Paddy Procurement, says Minister Gangula Kamalakar DNN Karimnagar: ప్రారంభం కానున్న వరి కోతలు, కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం - సన్న బియ్యానికి డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/a4da1d553b7aac43e46795364f4f97ec1666770643100233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ట్రాక్ హార్వెస్టర్లను సిద్ధం చేసుకుని రైతులు సన్నద్ధం అవుతున్నారు. మొత్తం ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.7 లక్షల పైగా ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఈసారి సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో దానికి తగినట్టుగా 30 వేల నుంచి 40 వేల ఎకరాల వరకు సన్న రకాలు సాగు చేశారు. అయితే దిగుబడి తక్కువగా ఉండడంతో పాటు డిమాండ్ కారణంగా వ్యాపారులు.. రైస్ మిల్లర్లు వీటిని ఎక్కువ ధరకు చెల్లించి నేరుగా కొనే అవకాశం ఉంది. ఇక ఈసారి నవంబర్ మొదటి వారంలో వరి కోతలు ప్రారంభమై చివర వరకు పూర్తయ్యే అవకాశం ఉంది.
గతంతో పోలిస్తే ఎకరాకు 22 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చినా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం దాదాపుగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు దిగుబడి వచ్చినా 4.5 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయానికి తీసుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ హుజరాబాద్ లను సెక్టార్లుగా విభజించి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు పూర్తి అయిన తర్వాత 24 గంటల్లోగా రైతులకు డబ్బు చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ధాన్యంలో 17 శాతానికి మించి తేమ ఉండకుండా చూసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు ఇక ఆరు శాతం వరకు తాలు రంగు మారిన ధాన్యం ఉన్న అంగీకరిస్తామని తెలిపారు రైతులు తమ పట్టాదారు పుస్తకం బ్యాంక్ పాస్బుక్ తో పాటు ఆధార్ కార్డుల జిరాక్స్‌లను కొనుగోలు సమయంలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
ధాన్యం సేకరణ కోసం కసరత్తు చేస్తున్న పౌరసరఫరాల శాఖ
ఈ వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు కరీంనగర్లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని దీనికి అవసరమైన నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌరసరఫరాల సంస్థకు అందించారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 7100లకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు అవసరమైన చోట మరో వంద వరకూ ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి గంగుల.
ఈ సారి పంట సేకరణకు 25 కోట్ల గన్నీబ్యాగులు అవసరమని ఇప్పటికే 14 కోట్ల గన్నీలను సేకరించామని, కొనుగోలు జరుగుతన్న తీరులో మిగతా గన్నీలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, పాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సమగ్ర సామాగ్రీ అందుబాటులో ఉందన్నారు. రాబోయే రెండున్నర నెల్ల పాటు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎక్కడ ఎలాంటి అవసరమున్నా తక్షణం స్పందించే విదంగా యంత్రాంగాన్ని సిద్దం చేసామన్నారు, దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)