అన్వేషించండి

Telangana Power Supply: తెలంగాణలో రైతులకు షాక్, వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో కుదింపు!

తెలంగాణలో విద్యుత్ సమస్య వచ్చి పడింది. రోజురోజుకు పెరిగిపోతున్న వాడకానికి తగ్గట్టుగానే సరఫరాలో మార్పులు చేసింది ప్రభుత్వం


వేసవిలో పెరిగిన విద్యుత్ వాడకం ప్రభుత్వాలకు సమస్యలు తీసుకొచ్చి పెడుతోంది. ఇప్పటి వరకు కోతలకు ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపించాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 

అయితే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలపై కరెంట్‌ ఎఫెక్ట్ పడుతుండగా.. తెలంగాణలో మాత్రం ఓన్లీ రైతులపై మాత్రమే ప్రభావం చూపనుంది. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు వేసవిలో పెరిగిన వాడకంతో విద్యుత్ భారీగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే వ్యవసాయానికి ఇచ్చే కరెంట్‌లో కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించించింది. 

వ్యవసాయానికి ఇచ్చిన విద్యుత్‌ను 7 గంటలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు TSNPDCL రాతపూర్వక ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించింది. 

తెలంగాణలో చాలా రోజుల నుంచి భారీగా విద్యుత్ కొరత కనిపిస్తోంది. డిమాండ్‌ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అందుకే కోతలు తప్పడం లేదన్నది ప్రభుత్వాధికారుల వాదన. 

యాసంగి పంట కోత దశకు రావడంతో విద్యుత్ వాడకం పెద్దగా ఉండదని అందుకే ఏడు గంటలకు కుదించినట్టు పేర్కొంటున్నారు  అధికారులు. దీని వల్ల పంటలపై పెద్దగా ప్రభావం పడబోదంటున్నారు.  

ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టి పారేస్తోంది. ఏ సెక్టార్‌లోనూ విద్యుత్‌ కోతల్లేవని చెబుతోంది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా టైం కుదించలేదని ప్రకటించారు జెన్సో సీఎండీ ప్రభాకర్‌ రావు. ఎన్‌పీడీసీలో ఉన్న సమాచార లోపం కారణంగా ఈ సమస్య వచ్చిందన్నారు. దీని వల్లే సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ప్రకటించారు. ఇకపై యథావిధిగా 24గంటలపాటు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారాయన. 

 

Telangana Power Supply: తెలంగాణలో రైతులకు షాక్, వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో కుదింపు!

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget