తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు ఓ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కుమారుడి పేరు సాయి భగీరథ్. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న సాయి భగీరధ్.. ఓ జూనియర్ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలపై కేసులు ఏంటని ప్రశ్నించారు. తాను తప్పు చేశాను అందుకే కొట్టాడని బాధితుడే చెప్పాడని మరి అలాంటి సమయంలో కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలే కానీ పిల్లలను అడ్డం పెట్టుకొని ఏం రాజకీయం అంటూ మండి పడ్డారు. ఓవైపు నాయకుల మధ్య వాడి వేడి మాటలు వెలువడుతున్న సందర్భంలో వీడియో లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది.
Vanasthalipuram Car 180 KMPH Speed Accident: తెల్లవారుజామున కారు బీభత్సం
Adilabad Cotton Farmers Protest: కనీస మద్దతు ధర పెంచాలంటూ రైతుల ఆందోళన
KA Paul on Secretariat Fire Accident : నరబలి జరిగింది. సీబీఐకి ఇవ్వాలని హైకోర్టుకు KA Paul | DNN
MLC Kavitha on Budget : అదానీ వ్యవహారంపై ప్రధాని మౌనం ఎందుకన్న కవిత | DNN | ABP Desam
Telangna Budget 2023 on Dalit Bandhu దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ సర్కార్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!