Virat Kohli on Retirement RCB Win IPL 2025 | గెలుపు సంబరాల్లో రిటైర్మెంట్ పైనా కోహ్లీ స్పందన
18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ కప్పు సాధించి విరాట్ కోహ్లీకి సరైన ట్రిబ్యూట్ ఇచ్చింది. కింగ్ 18ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ఇచ్చేలా సాగిన ఫైనల్ ను 6 పరుగుల తేడాతో గెలుచుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్లాన్స్, తన గెలుపు ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు కింగ్ కోహ్లీ. 18ఏళ్ల పోరాటం తర్వాత కప్పును ముద్దాడే క్షణాలను తన జీవితంలో మర్చిపోలేన్న విరాట్ కోహ్లీ..రిటైర్మెంట్ పైనా చెప్పీ చెప్పన్నట్లుగా మాట్లాడాడు. తన యవ్వనం, ప్రైమ్ అంతా ఆర్సీబీలోనే గడిపోయిందని ఇన్ని సంవత్సరాల పాటు RCB కి ఆడిన తర్వాత పడిన కష్టానికి కప్పు లభించటమే ప్రతిఫలం అన్నాడు కోహ్లీ. ఇంపాక్ట్ ప్లేయర్ గా తను ఆడలేనని చెప్పిన విరాట్...20 ఓవర్ల పాటు గ్రౌండ్ లోనే ఉండాలని కోరుకుంటానని తన ముద్ర మ్యాచ్ మొత్తం కనపడాలని కోరుకునే ఆటగాడినని చెప్పాడు. బెంగుళూరు ప్రేమ అభిమానం ఆప్యాయతలను ఎప్పటి మర్చిపోలేన్న కోహ్లీ... ఓపిక ఉన్నంత కాలం ఐపీఎల్ ఆడతానని క్లారిటీ ఇచ్చేశాడు. ఆడే చివరి రోజూ వరకే బెంగుళూరుకే ఆడతానని కూడా స్పష్టం చేసిన కోహ్లీ.. తన మనసు ఎప్పటికీ బెంగుళూరుతోనే ఉంటుందన్నాడు. బెంగుళూరులో అభిమానుల మధ్య సంబరాల కోసం వెయిట్ చేస్తున్నాంటూ బస్ పరేడ్ గురించి కూడా మాట్లాడాడు కోహ్లీ. రాబోయే ఇంగ్లండ్ సిరీస్ కోసం కుర్రాళ్లకు బెస్ట్ విషెస్ చెప్పిన విరాట్...ఐపీఎల్ ట్రోఫీ ఎంత గొప్పదైనా టెస్టు క్రికెట్ తో పోలిస్తే ఐదు లెవల్స్ కింద ఉంటుందంటూ టెస్ట్ క్రికెట్ పై తన ప్రేమ ఏంటో చెప్పాడు కింగ్ కోహ్లీ.





















