Shreyas Iyer Speech after RCB Win | IPL 2025 లో మా పోరాటం ముగిసిపోలేదు | ABP Desam
We have Lost the Battle but not the war. ఇది నిన్న ఆర్సీబీతో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఓడిపోయిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్న మాట. ఈ ఒక్క మాట చాలు. మ్యాచ్ లో అంత దారుణంగా ఓడిపోయినా కూడా తమ కాన్ఫిడెన్స్ ఎక్కడా దెబ్బ తినలేదు అని అయ్యర్ చెప్పాడు అని అనుకోవటానికి. ఎందుకంటే ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 ఆడే టీమ్స్ కి ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైయర్ 1 లో ఓడిపోయినా ఫైనల్ కి చేరుకునేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. అదే క్వాలిఫైయర్ 2. ఈరోజు ముంబై, గుజరాత్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే విజేతతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడనుంది పంజాబ్ కింగ్స్. ఒకవేళ అందులో గెలిస్తే మళ్లీ ఫైనల్ కి వెళ్లి అదే ఆర్సీబీ మీద మళ్లీ తలపడొచ్చు. బాగా ఆడితే కప్పు కూడా కొట్టొచ్చు. అందుకే శ్రేయస్ కి ఆ కాన్ఫిడెన్స్. వాస్తవానికి నిన్న ఆడినంత చెత్త ఫామ లో అయితే పంజాబ్ జట్టు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, శశాంక్ సింగ్, స్టాయినిస్, శ్రేయస్ అయ్యర్ ఐదుగురు బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో మార్కో యాన్సన్ వెళ్లిపోవటం, చాహల్ గాయం పెద్ద దెబ్బ పడింది కానీ ఈ సీజన్ లో నిన్నటివరకూ ఛాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది పంజాబ్ కింగ్స్. సో క్వాలిఫైయర్ 2 ఈ లోపాలు అన్నీ సరిచేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. శ్రేయస్ కూడా అదే మాట చెప్పాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత. తప్పు ఎవరిది అని నిందించుకోవటం కూర్చోలేం. మా బౌలర్లను అనలేం. వాళ్లు అంత తక్కువ స్కోరు డిఫెండ్ చేయటం టీ20ల్లో అసాధ్యం. బ్యాటర్లను ఒక్క మ్యాచ్ ఫలితానికి తక్కువ చేసి మాట్లాడలేం. మాకు కావాల్సిందల్లా కొంచెం టైమ్. మళ్లీ విరుచుకుపడగలమనే నమ్మకం ఉంది అన్నాడు. ఏమో అయ్యర్ అనుకున్నట్లుగానే జరిగితే మళ్లీ ఇదే ఆర్సీబీతో ఐపీఎల్ ఫైనల్ ఆడుతుందేమో మూడో తారీఖున పంజాబ్.





















