RCB vs SRH Match Highlights IPL 2025 | RCB NRR కరిగించేసి..టాప్ 2 కలకు గండి కొట్టిన SRH
అస్సలు ఊహించి కూడా ఉండదు RCB. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని. ఎవే గేమ్స్ లో వరుసగా 6 మ్యాచ్ లు గెలిచి...కాలర్ ఎగరేస్తున్న ఆర్సీబీని..టాప్ 2 ప్లేస్ కోసం టార్గెట్ చేసిన టైమ్ లో చావు దెబ్బ కొట్టింది ఆరెంజ్ ఆర్మీ. ముందు బ్యాటింగ్ లో తర్వాత బౌలింగ్ లో అనూహ్యంగా దూసుకొచ్చి RCB ను ఓ స్థానం కిందకు దింపేయటమే కాదు నెట్ రన్ రేట్ ను కరిగించేసి తీరని అన్యాయమే చేసింది. కీలక మ్యాచ్ ల్లో చోక్ అయ్యే అలవాటున్న ఆర్సీబీకి హిస్టరీలో నాలుగో సారి మెరుగైన అవకాశాలకు గండి కొట్టి కన్ను లొట్టబోయేలా చేసింది. అసలేం జరిగిందంటే భారీ వర్షాల కారణంగా బెంగుళూరు హోం గ్రౌండ్ మ్యాచ్ ఆర్సీబీ లక్నోకు మార్చుకుంది. హోం గ్రౌండ్ లో అంతంతమాత్రమే అయినా ఏవే మ్యాచెస్ లో వరుసగా 6 గెలిచిన ఆర్సీబీ టాస్ గెలిచి ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయిన SRH కు ఫస్ట్ బ్యాటింగ్ అప్పగించింది. పిచ్ మీద డ్యూ వాడుకుని గెలిచేద్దాం అనుకున్నాడు స్టాండింగ్ కెప్టెన్ జితేశ్ శర్మ. కానీ ఇషాన్ కిషన్ ఎడతెగని పోరాటం చేయటంతో ఆర్సీబీ అసలు ఏ మాత్రం ఊహించని స్కోరు చేసింది సన్ రైజర్స్. అభిషేక్ శర్మ 34పరుగుల మెరుపుల తర్వాత వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 7ఫోర్లు 5 సిక్సర్లతో 94పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి వరకూ నాటౌట్ గా నిలిచాడు. క్లాసెన్, అనికేత్ కూడా తలో చేయి వేయటంతో సన్ రైజర్స్ బోర్డ్ మీద 231పరుగుల భారీ స్కోరు పెట్టింది. 232 పరుగుల ఛేజింగ్ ను భయంకరంగా ఆరంభించిన RCB...విరాట్ కొహ్లీ, ఫిల్ సాల్ట్ చెలరేగి ఆడటంతో పరుగుల వరద పారించింది. 25 బంతుల్లో 7ఫోర్లు ఓ సిక్సర్ తో 43పరుగులు చేసి కొహ్లీని హర్ష్ దూబే అవుట్ చేయటం ఆర్సీబీ కి దిమ్మ తిరిగే షాక్. అయినా మళ్లీ కోలుకున్న ఆర్సీబీ ఈసారి సాల్ట్ బాదటంతో మయాంక్ తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. ఓ దశలో 15ఓవర్లకు 3వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసిన ఆర్సీబీ మిగిలిన ఐదు ఓవర్లలో 60పరుగులు చేస్తే చాలు. ఇంకా బోలెడు వికెట్లు ఉండటంతో ఛేజ్ చేసేస్తుంది అనుకున్నారు కానీ సన్ రైజర్స్ బౌలర్ ఈషన్ మలింగ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో పటిదార్ ను రనౌట్ చేసి, రొమారియో షెపర్డ్ ను క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో ఉన్నపళంగా లయ దెబ్బ తిన్న ఆర్సీబీ అనూహ్యంగా చోక్ అయ్యి 189పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఐదు బంతుల తేడాలో మూడు వికెట్లు... నాలుగంటే నాలుగు ఓవర్లలో 7వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ సన్ రైజర్స్ పై 42పరుగుల తేడాతో మ్యాచ్ ను ఓడిపోవటంతో పాటు నెట్ రన్ రేట్ ను కోల్పోయి పాయింట్ల పట్టికలో రెండు నుంచి మూడోస్థానానికి పడిపోయింది. సన్ రైజర్స్ పెట్టిన ఎర్త్ కు ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి టాప్ 2 జట్టుగా వెళ్లాలంటే మాత్రం 27వ తారీఖు LSG మీద తప్పనిసరిగా గెలవటంతో పాటు పంజాబ్ తనకు మిగిలిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవాలని కోరుకోవాలి.





















