Jasprit Bumrah Yorker to Washington Sundar | IPL 2025 లో ముంబైని ఎలిమినేటర్ కి తీసుకెళ్లిన బాల్ ఇదే
ముంబై విసిరిన 229 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఛేజ్ చేస్తోంది. మిస్టర్ డిపెండబుల్ సాయి సుదర్శన్ కి తోడు గా వాషింగ్టన్ సుందర్ కి మంచి ఊపు మీదున్నాడు. 13.3 ఓవర్లలోనే 151పరుగులు చేసింది గుజరాత్. సుదర్శన్ అప్పటికి 46 బంతుల్లో 79పరుగులు చేస్తే...సుందర్ 23 బాల్స్ లోనే 48పరుగులు చేశాడు. అప్పుడే జస్ట్ రెండు భారీ సిక్సర్లు కూడా కొట్టాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ గెలవాలంటే గుజరాత్ 39 బాల్స్ లోనే 79పరుగులు చేస్తే చాలు. సాయి, సుందర్ ఉన్న ఫామ్ కి ఛేజ్ చేసేసేస్తారని అనిపించింది. అలాంటి టైమ్ లో బౌలింగ్ కి వచ్చిన బుమ్రా మ్యాచ్ గతిని మార్చేశాడు. ఆ ఓవర్లో తను వేసిన నాలుగో బంతికి వాషింగ్టన్ సుందర్ ను ఫర్ ఫెక్ట్ యార్కర్ తో బురిడీ కొట్టించాడు. కాళ్ల వేళ్లను పగుల గొట్టేలా వస్తున్న ఆ బంతి చేసే గాయాన్ని తప్పించుకునే క్రమంలో తన కాళ్లు తీశాడు సుందర్ అంతే... వికెట్లు గాల్లోకి లేచాయి. వాషింగ్టన్ సుందర్ కూడా తనను తను కంట్రోల్ చేసుకోలేక బొక్క బోర్లా పడిపోయాడు. బుమ్రా యార్కర్ కి ఉండే పదును అది. అంత క్రూషియల్ టైమ్ లో 48పరుగులు చేసిన సుందర్ అవుట్ అవటంతో గుజరాత్ తడబడింది. ఆ వచ్చిన తడబాటును వాడుకుని ఒత్తిడి క్రియేట్ చేసిన గ్లీసన్ కీలక బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ ను కూడా ఔట్ చేయటంతో గేమ్ లోకి ముంబై మళ్లీ దూసుకొచ్చి ఏకంగా గుజరాత్ ను 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అలా బుమ్రాను కీలక టైమ్ లో సుందర్ ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పి ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై గెలిచేలా చేశాడు.





















