Hardik Pandya Sweetly warns rival IPL teams: మమ్మల్ని కట్ చేస్తే, వంద శాతం పేలుతాం | ABP Desam
TataIPL 15వ సీజన్ March 26 నుంచి ప్రారంభమవుతోంది. IPL ప్రసారం చేసే Star Sports, Disney Plus Hotstar IPL Fever తెలిసేలా వరుస Promos తో కుమ్మేస్తున్నాయి. ఇప్పుడు Latest Promo లో Gujarat Titans Captain Hardik Pandya సందడి చేశాడు. ఆ ప్రోమోలో ఏముందంటే... ఓ బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి వెళ్లిన ఇద్దరు... అక్కడ ఒక్కసారిగా Confuse అవుతారు. ఎప్పుడూ ఉండాల్సిన 8 వైర్ల స్థానంలో పది వైర్లు వచ్చాయేంటి అని అయోమయంలో పడతారు. సర్ ని అడిగి తెలుసుకుందామనుకుని హార్దిక్ కు ఫోన్ చేస్తారు. సర్ కొత్తగా వచ్చిన వైర్లు కట్ చేసేస్తాం, ఏం కాదు అని అంటారు. హార్దిక్ వద్దు, వద్దు అని వారిస్తున్నా సరే వాళ్లు ఆ వైర్లు కట్ చేసేస్తారు. బాంబ్ పేలిపోతుంది. హార్దిక్ అప్పుడు ఓ Sweet Warning ఇస్తాడు. కొత్తవే కదా అని Cut చేయాలని చూస్తే, అవి కచ్చితంగా పేలుతాయని.... ఇప్పటికే అర్థమైందిగా ఆ రెండు కొత్త వైర్లు Gujarat Titans, Lucknow SuperGiants. మరో 13 రోజుల్లో స్టార్ట్ అవబోయే ఐపీఎల్ కోసం మీరెంత ఎగ్జైటింగ్ గా ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి.