![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Afghanisthan Upsets Newzealand in T20 Worldcup 2024 | న్యూజిలాండ్‌పై ఆఫ్ఘన్ విజయం
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ పెను సంచలనం సృష్టించింది. బలమైన న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. విజయం అంటే అల్లాటప్పా విజయం కాదు. లాస్ట్ బాల్ దాకా సాగిన థ్రిల్లర్ అంత కంటే కాదు. ఏకంగా 84 పరుగులతో గెలిచి చావు దెబ్బ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయింది.
అంటే చేయాల్సిన పరుగుల్లో కనీసం సగం కూడా చేయలేదన్న మాట. మొత్తం జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 18 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్దే హయ్యస్ట్ స్కోరు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో గుర్బాజ్ ఒక్కడే 80 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ జట్టు మొత్తం కలిసినా గుర్బాజ్ చేసిన స్కోరు కూడా చేయలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరూకీ, రషీద్ ఖాన్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. మహ్మద్ నబీకి రెండు వికెట్లు దక్కాయి. న్యూజిలాండ్ నెట్‌రన్‌రేట్ కూడా -4పైగా ఉంది. దీంతో న్యూజిలాండ్ సూపర్-8 ఛాన్సులు కాస్త క్లిష్టం అయ్యాయనే అనుకోవాలి. గ్రూప్-సిలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానే టాప్‌లో ఉండటమే ఇప్పుడు పెద్ద సంచలనం.
![Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/9968f1e3bfa726bf2463a9fa7ff8fd601719738948187310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Virat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/6d9eb9fed82845b0bc61e63f9c0f51e11719725292490310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Virat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/f7a0d2d45ee136170b9100c576d644df1719725069019310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Rohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/b77fb4b7342aaa6a6204052b234eac351719724890749310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Akshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/14c15a3b596c370979d8416fc9d529401719724731334310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)