అన్వేషించండి
అమ్మవారికి ఏకాంతంగా పల్లకీ ఉత్సవం. | ABP Desam
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జరిగింది.ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేక పోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ,ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్





















