(Source: ECI/ABP News/ABP Majha)
Usha Chilukuri vs Kamala Harris | Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP Desam
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జయభేరి మోగించారు. అమెరికాలో సగానికి పైగా రాష్ట్రాలు ట్రంప్ వైపే నిలిచాయి. పేరుకే ఇది ట్రంప్ వర్సెస్ కమలాహారిస్ అయినా...ఈ యుద్ధంలో ట్రంప్ కి తోడుగా నిలిచింది ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్. కమలాహారిస్ పూర్వీకులది తమిళనాడు అయితే ఉషా చిలుకూరి పూర్వీకూలు తెలుగు మూలాలు ఉన్నవారు. కమలాహారిస్ తల్లికి తండ్రి అంటే కమలా తాతగారైన పీవీ గోపాలన్ ఓ బ్యూరోక్రాట్. తమిళనాడులోని తులసేంథిరపురం నుంచి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు వాళ్లు. కమలాహారిస్ తల్లి అమెరికాకు వెళ్లటం అక్కడే పెళ్లి...కమలాహారిస్ ఆమె సోదరి జన్మించటం వాళ్లు పాలిటిక్స్ లోకి రావటం ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడటం అన్నీ జరిగిపోయాయి. గత ఎన్నికల్లో ఉపాధ్యక్షురులిగా ఎన్నికై ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మూలాలున్న మహిళగానూ కమలాహారిస్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రిపబ్లికన్ సైడ్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వ్యాన్స్ ను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వీకులు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు. వారి బంధువులు విశాఖపట్నంలో ఇప్పటికీ ఉన్నారు. ఆ తర్వాత ఉషా చిలుకూరి తల్లి తండ్రులు అమెరికాకు వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడే ఉషా జననం ఆ తర్వాత లా తర్వాత జేడీ వ్యాన్స్ తో పెళ్లి జరిగాయి. సో అలా అనుకోకుండానే లేదా వ్యూహాత్మకంగానే డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలు రెండూ కూడా భారతీయ మూలాలన్న వ్యక్తుల ప్రమేయం ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఉండేలా చేశాయి. ట్రంప్ గెలుపుతో తమిళ సంతతి మహిళ అయిన కమలాహారిస్ బృందం పై తెలుగు సంతతి మహిళ అయిన ఉషా చిలుకూరి బృందం పై చేయి సాధించిందన్న మాట.