Shubanshu Shukla Taking Indian Food Travel to Space | శుభాన్షు రోదసిలోకి తీసుకువెళ్తున్నవి ఇవే | ABP Desam
శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం మొదలైంది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శుభాన్షు శుక్లా యాక్సియమ్ 4 మిషన్ లిఫ్ట్ ఆఫ్ అయ్యింది. ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా యాక్సియమ్ 4 కు పైలెట్ గా వ్యవహరిస్తున్నారు. తన భార్య పిల్లలు, కుటుంబానికి సెండ్ ఆఫ్ ఇచ్చిన శుభాన్షు స్పేస్ ప్రయాణాన్ని ప్రారంభించారు. 14రోజుల పాటు శుభాన్షు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. అయితే తనతో స్పేస్ లోకి వెళ్లేటప్పుడు కొన్ని వస్తువులను శుభాన్షు ప్యాక్ చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఇండియన్ కల్చర్ ఫుడ్. రాకేశ్ తర్వాత స్పేస్ లోకి వెళ్తున్న రెండో భారతీయుడైన శుభాన్షు శుక్లా తనతో పాటు మామిడి రసాన్ని, క్యారెట్ హల్వాను, పెసరపప్పు పాయసాన్ని స్పేస్ లోకి తీసుకువెళ్తున్నారు. వీటితో పాటు జాయ్ అనే చిన్న పాటి హంస బొమ్మను తనతో తీసుకువెళ్తున్నట్లు శుభాన్షు శుక్లా నాసాకు తెలిపారు. భారతీయుడైన తను తమ సంస్కృతికి సంబంధించిన ఆహారపదార్థాలను స్పేస్ లోకి తీసుకువెళ్లటానికి గర్వపడుతున్నట్లు శుభాన్షు నాసా అధికారులకు తెలిపారు.



















