PM MODI: పంజాబ్ లో ప్రధాని పర్యటనలో పరిణామాలపై కమిటీ
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. కమిటీలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మెహ్తాబ్ సింగ్ గిల్, పంజాబ్ హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి , జస్టిస్ అనురాగ్ వర్మ సభ్యులుగా ఉన్నారు. కమిటీ నివేదికను 3 రోజుల్లోగా సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ నియామకాన్ని పంజాబ్ భాజపా నాయకులు ఖండించారు. సీఎం నియమించిన కమిటీ... ఘటనపై ఎలాంటి ఆధారాలు సంపాదించలేదని, ఎందుకంటే ఈ కాన్సిపరసీ వెనుక ఉన్నది స్వయాన ముఖ్యమంత్రేనని పంజాబ్ భాజపా అధ్యక్షుడు అశ్వనీ శర్మ విమర్శించారు. మరోవైపు జరిగిన ఘటనపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని భద్రత విషయంలో ఇలా జరిగి ఉండాల్సి కాదని ఆయన అన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజు రాష్ట్రపతి కోవింద్ ను ప్రధాని మోదీ కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉంది.




















