అలాంటి పార్టీ మత్తులో కపుల్ ఎక్స్‌ఛేంజ్ నిజమే: ఏబీపీ దేశంతో నిర్మాత నట్టి కుమార్ |
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాంటి పార్టీల్లో కపుల్ ఎక్స్‌ఛేంజ్ నిజంగానే జరుగుతుందని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి హేమను గెంటేయాలని పిలుపునిచ్చారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాంటి పార్టీల్లో కపుల్ ఎక్స్‌ఛేంజ్ నిజంగానే జరుగుతుందని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి హేమను గెంటేయాలని పిలుపునిచ్చారు.సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు తరచూ పార్టీలు చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకోవడానికి సెలబ్రెటీలే ఏముంది కానీ.. అందరూ తరచూ వివిధ కారణాలతో పార్టీలు చేసుకుంటారు. కానీ అలాంటి వాటిలో పోలీసులు ఎక్కువగా ఇన్వాల్వ్ కారు. మరి ఈ రేవ్ పార్టీలపై ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు. బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొనడంపై పెద్దఎత్తున వివాదం రేగిన సంగతి తెలిసిందే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ అని తేలినందుకు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. హేమపై మా అసోసియేషన్ చర్యలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.





















