Festive mood in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ | Vaikuntha Ekadasi
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ ఉట్టిపడుతోంది. ఉత్తరద్వార దర్శనానికి తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో క్యూ కట్టారు. సింహాచలంలో అనువంశిక ధర్మకర్తల దర్శనం తర్వాత సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. అన్ని రకాల ఆర్జిత సేవలు నిలివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నెల్లూరులో పెన్నా తీరాన వెలిసిన తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో... శ్రీరామచంద్రుడు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు అభయమిచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవుని కడపలోనూ కన్నులపండువగా ఉత్తరద్వార దర్శనం జరిగింది. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు.





















