Congress CM Candidate in UP: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ప్రియాంక క్లారిటీ | Elections
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి కనిపిస్తోంది. పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో ఆ పార్టీ అగ్రనాయకులు Rahul Gandhi, Priyanaka Gandhi Wadra యూత్ మేనిఫెస్టోను విడుదల చేశారు. యూపీలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రియాంకను ప్రశ్నించారు. యూపీ కాంగ్రెస్ లో తాను తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని, ఎక్కడ చూసినా తానే ఉన్నానంటూ ప్రియాంక బదులిచ్చారు. దీంతో తానే సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నట్టు సంకేతాలిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రియాంక నిజంగా సీఎం అయితే 6 నెలల్లోగా ఆమె శాసనసభ లేదా మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుత సీఎం ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్సీయే.





















