Bandi Sanjay: కరీంనగర్ కోర్టులో బండి సంజయ్ కు చుక్కెదురు...బెయిల్ కు నిరాకరణ|
ఆదివారం రాత్రి జన జాగరణ దీక్ష నుంచి అరెస్టు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ కోసం పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంతకుముందు బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహింపజేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై సభలు, సమావేశాలు ఆయన నిర్వహించుకొనేందుకు అనుమతి లేదని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. బండి సంజయ్‌పై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామని.. మొత్తం 25 మందితో పాటు మరికొందరిపై కరోనా నిబంధనల కింద కేసులు పెట్టామని కరీంనగర్ సీపీ తెలిపారు. బీజేపీ శ్రేణులు కావాలనే పోలీసులపై దాడికి దిగారని సీపీ తెలిపారు.





















