Australian Open : ఛైర్ అంపైర్ పై విరుచుకుపడ్డ డేనియల్ మెద్వెదెవ్
టెన్నిస్ ఆటగాడు Daniel Medvedev ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో తీవ్రంగా ఆగ్రహించాడు. ఛైర్ అంపైర్ తీరుపై మండిపడ్డాడు. సిట్సిపాస్ తో సెమీఫైనల్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. స్టాండ్స్ లో ఉన్న సిట్సిపాస్ తండ్రి... అతడికి నిబంధనలకు విరుద్ధంగా సూచనలు ఇస్తుండటం, అంపైర్ ఎంతకీ పట్టించుకోకపోవడంపై మెద్వెదెవ్ ఆగ్రహించాడు. బ్రేక్ టైంలో అంపైర్ పక్కనే కూర్చుని.. అక్కడేం జరుగుతుందో నీకు కనపడట్లేదా అంటూ అరిచాడు. అంపైర్ ఏదో సర్దిచెప్పి తల పక్కకు తిప్పుకుంటే నేను నిన్నే అడుగుతున్నాను జవాబు చెప్పు అంటూ మరోసారి నోరు పారేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ ను పక్కన పెడితే.. సెమీస్ లో గెలిచిన మెద్వెదెవ్... ఫైనల్లో నాదల్ తో తలపడతాడు.





















