అన్వేషించండి
ABP Desam impact| నెల్లూరు పోలీసులతీరును ప్రశ్నించిన ABP Desam, తీరు మార్చుకున్న పోలీసులు
Nelloreలో పోలీసుల తీరు వివాదాస్పదం అయింది. స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలను పురుష పోలీసులే తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్‌లకు ఈ రోజు (ఫిబ్రవరి 7) కొత్త యూనిఫామ్ కోసం కొలతలు తీసుకుంటున్నారు. అయితే అందుకోసం పురుషులే మహిళల కొలతలను తీసుకుంటున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు బయటకొచ్చాయి. ఎబిపి దేశం నెల్లూరు పోలీసులను కాంటాక్ట్ చేసి వివరణ అడగగా, వెంటనే మహిళా స్టాఫ్ ను డ్యూటీ లో పెట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్





















