Corona Third Wave: అక్టోబర్‌లో కొవిడ్19 థర్డ్ వేవ్ తీవ్ర రూపం
ఇండియాలో అక్టోబర్ నెలలో కొవిడ్19 థర్డ్ వేవ్ విజృంభిస్తోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ప్రధాని మోదీ కార్యాలయానికి పంపిన నివేదికలో కరోనా థర్డ్ వేవ్ విషయాన్ని ప్రస్తావించింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తాజాగా పెరుగుతున్నాయి. దేశంలో ఇదివరకే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సంభవించాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ ఉద్ధృతితో భారీగా ప్రాణ నష్టం సంభవించగా.. అక్టోబర్‌లో భారత్ కు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణుల కమిటీ పేర్కొంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.





















