Manchu Vishnu About Prabhas | ఎమోషనల్ అయిన మంచు విష్ణు
మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, స్టార్ హీరో ప్రభాస్ నటించిన కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అలాగే కన్నప్ప సినిమా మంచు విష్ణు తీయడానికి కారణం శివుడి ఆజ్ఞ మాత్రమే కారణం అని అన్నారు బ్రహ్మానందం. కన్నప్ప సినిమాలో నటించిన యాక్టర్స్ అంతా కూడా శివుడి ఆజ్ఞ వల్లే నటించారని అన్నారు బ్రహ్మానందం. కన్నప్ప సినిమా మంచు మోహన్ బాబు ఎందుకు తీస్తున్నారని అనుకున్నానని, ఈ సినిమా కోసం తండ్రి కొడుకు ఇద్దరు చాలా కష్టపడ్డారని అన్నారు హాస్య నటుడు బ్రహ్మానందం. అయితే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మోహన్ బాబు స్పీచ్ ఇస్తుంటే ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. నేను చెప్పింది మీరు కాస్త వినండి అంటూ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చారు మంచు మోహన్ బాబు. ఈ ఈవెంట్ లో మంచు మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ నా కోసం వచ్చిన దేవుడు అని అన్నారు మంచు విష్ణు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడిని, నేను ప్రభాస్ కి కర్ణుడిని అని అన్నారు మంచు విష్ణు.





















