Dil Raju Brother Shirish Apology Letter to Fans | మెగా ఫ్యాన్స్ కు సారీ
గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి దిల్ రాజు.. అయిన తమ్ముడు శిరీష్ వీపరీతమైన ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు. గేమ్ చేంజర్ విడుదల తర్వాత తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని దిల్ రాజు సోదరుడు శిరీష్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. 'సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో ఏమైనా హెల్ప్ చేశాడా డైరెక్టర్ చేశాడా కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు'' అని అన్నారు.
శిరీష్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తమ అభిమాన హీరో, సినిమాల గురించి మాట్లాడితే ఒప్పుకోమంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. చరణ్ మూడేళ్ల టైంని వృథా చేయడం మాత్రమే కాకుండా ఇలా మాట్లాడడం ఏంటంటూ ఫైర్ అయ్యారు. 'బాయ్ కాట్ ఎస్వీసీ' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దాంతో శిరీష్ సారీ చెప్పక తప్పలేదు. ఈ మేరకు ఒక లెటర్ ని విడుదుల చేసారు.
తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో అపార్థాలకు దారి తీసి... దాని వలన కొందరు మెగా అభిమానులు బాధ పడినట్లు తెలిసిందని అన్నారు శిరీష్. 'గేమ్ చేంజర్' సినిమా కోసం రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందంచారని ... మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి తమకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉందని అన్నారు. అలాగే చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడమని అన్నారు. ఒకవేళ తన మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి'' అంటూ ఒక లెటర్ విడుదల చేశారు దిల్ రాజు తమ్ముడు.





















