Rana in WWE : డబ్ల్యూడబ్ల్యూఈకి హీరో రానా ప్రచారం
రెజ్లింగ్ షోలలో రారాజులా రెండు దశాబ్దాల నుంచి ప్రాచుర్యంలో ఉన్న WWE కి ఇకపై మన తెలుగు హీరో రానా ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ను సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించింది డబ్య్లూడబ్య్లూఈ బృందం. షూట్ లో భాగంగా హార్లే డేవిడ్ సన్ పై సూపర్ ఎంట్రీ ఇచ్చిన రానా...రెజ్లింగ్ రోప్ ల పై నిలబడి ప్రొఫెషనల్ లా సందడి చేశారు. ఈ సీక్వెన్స్ బాగా వచ్చిందని నిర్వాహుకులు సంతోషం వ్యక్తం చేశారు. రానా కూడా డబ్య్లూడబ్య్లూఈ కి క్యాంపెన్ చేయటం పై సంతోషం వ్యక్తం చేశాడు. తెలుగు, తమిళ్ లో మంచి మార్కెట్ ఉన్న ఈ ప్రోగ్రాంకి క్యాంపెన్ చేయటం మంచి అవకాశం అన్న రానా.....షూటింగ్ లో చాలా ఆస్వాదించానని చెప్పాడు.





















