Vishnu Manchu Kannappa Movie Review | విష్ణు మంచు చెప్పినట్లు కన్నప్ప నిజంగా కళాఖండమా.? | ABP Desam
మంచు విష్ణు.. కన్నప్ప సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శివయ్యా అన్న పిలుపు ట్రైలర్ లో వైరల్ కావటంతో మొదలైన కన్నప్ప సినిమా బజ్ ను సస్టైన్ చేస్తూ ఈ రోజు విడుదల వరకూ వచ్చేసింది. మంచు అన్న అంటే జనరల్ గా ఉండే ట్రోలింగ్ స్టఫ్..ఆయన ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడే ఓవర్ ది బోర్డ్ మాటలు పక్కన పెడితే అసలు కన్నప్ప సినిమా ఎలా ఉందో నిజాయితీగా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం.
ముందుగా స్పాయిలర్ అలర్ట్. నేనేం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేయను కానీ ఈ సినిమా నిజంగా మీరు అనుకున్నట్లుగా భక్త కన్నప్ప కథ కాదు. ఈసినిమా మైథలాజికల్ మూవీ కాదని హిస్టారికల్ మూవీ అని మంచు విష్ణునే ప్రకటించారు. భక్త కన్నప్ప కథ నుంచి స్ఫూర్తి పొంది కొన్ని పాత్రలను అదనంగా జోడించుకుని..శివుడి మీద భక్తి భావనను చాటుకోవటమే లక్ష్యంగా విష్ణు మంచు చేసిన ప్రయత్నం. ఈ విషయాన్ని సినిమాకు ముందు కూడా మోహన్ బాబుతో వాయిస్ ఓవర్ లో చెప్పించారు. అయితే భక్త కన్నప్ప కథను సినిమాగా తెరకెక్కించాలన్న ప్రయత్నం ఎంత నిజాయితీగా చేశారనే దాని మీదే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడతాయి. సినిమా చూడటం అనేది వీక్షకుడి కోణం నుంచి ఉంటుంది కాబట్టి...నా పర్సెప్షన్ లో ఈ సినిమా..మంచు విష్ణు అతని టీమ్ నిజాయితీతో చేసిన ఓ మంచి ప్రయత్నం. మంచు విష్ణు సినిమా అంటేనే ఓ సీరియస్ సినిమా అనుకుని వెళ్లరనే విషయం మే బీ తనకు కూడా తెలుసు. ట్రోలింగ్ స్టఫ్ లా తను మారిపోయినా... చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియా లో చాలా అబ్యూస్ ను హేట్రెడ్ ని ఫేస్ చేస్తూనే ఉన్నా...తన మాటలు, అతి కారణంగానే తన మీద ఎంత నెగటివిటీ ఉన్నా వాటిన్నంటిని పట్టించుకోకుండా దాటుకుని చాలా చక్కగా కన్నప్పను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు మంచు విష్ణు.
కథ విషయానికి వస్తే శ్రీకాళహస్తిలో ని వాయులింగాన్ని బయట ప్రపంచానికి కనపడకుండా మహాదేవశాస్త్రి అనే మహా శివభక్తుల వంశం కాపాడుతూ ఉంటుంది. ఆ కాపాడటంలో మహాదేవశాస్త్రి స్వార్థం కూడా ఉంటుంది. తను తన వంశం వాళ్లు తప్ప మరొకరు శివయ్యను చూడకూడదనే స్వార్థం. ఆ వాయు లింగం ఉన్న ప్రదేశానికి బయటి వ్యక్తులు వెళ్లకుండా కాపలాగా ఐదు తెగలు అడవిని కాపాడుతూ ఉంటాయి. ఆ అడవిలో ఓ తెగలో పుట్టిన తిన్నడు పరిస్థితుల కారణంగా పరమనాస్తికుడిగా పెరిగిన వైనం.. తర్వాత ఆ పిల్లాడే పెద్దాడై ఎలా శివభక్తుడిగా మారాడు. అందుకు దారి తీసిన పరిస్థితులేంటీ..ముక్కంటికే కంటి చూపును ప్రసాదించిన ఆ పరమభక్తి తిన్నడికి ఎలా వచ్చింది. తిన్నడు అసలు కన్నప్పగా మారిన విధానం ఇదంతా కన్నప్ప సినిమాలో ప్రధాన అంశం. సినిమాటిక్ లిబర్టీ కోసం తెగలు, ఆటవిక జాతులు వాటి మధ్య మనస్పర్థలు...వాయులింగం కోసం బయటి నుంచి వచ్చి తెగబడే దుష్టశక్తులు ఇలా ఓ గ్రాండియర్ స్కేల్ లో కథను రాసుకున్నారు.
సినిమా కథనం విషయానికి వస్తే
తిన్నడు నాస్తికుడుగా ఎందుకు మారాడనే విషయం దగ్గర మొదలు పెట్టి వాయులింగం కోసం వందల ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్న తెగలు అలా కలిసిపోయాయి అనేంత వరకూ ప్రథమ భాగం..తర్వాత తిన్నడు వాయులింగంతో ఎలా బంధాన్ని పెనవేసుకున్నాడు..కన్నప్పగా ఎలా మారాడు అనేంత వరకూ సెకండాఫ్ లోనూ చూపించారు. బ్యాక్ స్టోరీ ఎక్కువగా ఉన్న కారణంగా ఫస్టాఫ్ అంతా కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా తీయటంలో డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. హిందీలో మహాభారతం అనే డివోషనల్ సీరియల్ ను ఏళ్లపాటు ఆయన నడిపించిన అనుభవం ఈ సినిమాకు కచ్చితంగా తీసుకువచ్చింది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే క్రెడిట్స్ లో మంచు విష్ణు పేరే ఉంది. ఒరిజినల్ గా తనికెళ్ల భరణి రాసుకున్న కథను..పదేళ్ల క్రితమే హక్కులు కొని ఇప్పటి తరానికి అర్థమయ్యేలా కథలో మార్పులు చేసుకున్నా వాటిని కూడా సినిమా చివరకు వచ్చే సరికి మంచు విష్ణు రాసుకున్న విధానం..ఆ మహాశివుడి లీలలకు అర్థం పరమార్థం చెప్పిన విధానం అన్నీ చక్కగా కుదిరాయి. ఇక ఈ సినిమాను నిలబెట్టిన పాత్ర అంటే కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు రుద్ర. ప్రభాస్ పోషించిన ఈ పాత్రనే సినిమాలో వేగాన్ని తీసుకువస్తుంది. అసలు ఈ సినిమా తీయటానికి వెనుక ఉన్న కోర్ పాయింట్ ను ఆడియెన్స్ కు అర్థమయ్యేలా చేసి ఈ సినిమా మీద తెలియకుండానే ఓ డివోషనల్ ఫీలింగ్ ను తీసుకువస్తుంది.
నటీ నటుల నటన, సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా కష్టపడ్డారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ తో తీసిన రొమాంటిక్ సీన్స్ కొంచెం పంటి కిందరాయిలా అనిపిస్తాయి కానీ కామి గానివాడు మోక్షగామి కాలేడనే లైన్ ని ఫాలో అయిపోయారేమో ఫస్టాఫ్ అలా అలా లాగించేశారు. కానీ సెకండాఫ్ సినిమాకు ప్రాణం. ఎప్పుడైతే రుద్రగా ప్రభాస్ ఎంటర్ అయ్యారో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రుద్రుడిగా..స్మశాన వాసిగా వైరాగ్యంతో కూడిన లుక్ లో ప్రభాస్ నిజంగా ఒదిగిపోయి నటించారు. ఆయన చెప్పే డైలాగులు..ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పండగే. తిన్నడైన మంచు విష్ణు, మహదేవశాస్త్రి అయిన మంచు మోహన్ బాబు..తిన్నడు భార్య అయిన నెమలితో ప్యారలల్ గా ప్రభాస్ తో నడిచే ఓ సీన్ కన్నప్ప సినిమాకు ప్రాణం అని చెప్పుకోవాలి. ఎన్నో ప్రశ్నలు..మరెన్నో సమాధానాలు..శివుడి తత్వం గురించి..శివుడి గొప్పతనం గురించి జరిగే ఆ సీన్ కన్నప్పను సినిమాను నిలబెట్టింది. మహదేవశాస్త్రి మోహన్ బాబు నటన గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏముంది. ఈ ట్రోలింగ్ గీలింగ్ లు పక్కనపెడితే మోహన్ బాబు అనే వ్యక్తి అద్భుతమైన నటుడు. ఆయన డైలాగ్ డిక్షన్ తో మహదేవశాస్త్రి పాత్రకు సరిగ్గా సరిపోయారు. నాకు పర్సనల్ గా మోహన్ బాబు, ప్రభాస్ మధ్య జరిగే డైలాగ్ వార్ మంచి హై ఇచ్చింది. ఇక అతిథి పాత్రలో మెరిసిన మోహన్ లాల్, మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్, తిన్నడు తండ్రిగా గూడెం పెద్ద అయిన నాథ నాథుడిగా శరత్ కుమార్ లు వాళ్ల పాత్రల పరిధుల మేరకు చక్కగా నటించారు. ఈ సినిమాలో మంచు విష్ణు పిల్లలంతా కనిపించటం విశేషం. సినిమా స్టార్టింగ్ లో కాళహస్తి కథను చెప్పే పాటలో అరియానా, వివియానా చక్కగా నటించారు వాళ్లే ఆ పాటను కూడా పాడారు. ఇక చిన్నప్పటి తిన్నడు గా అవ్రామ్ భక్త భలే క్యూట్ గా అనిపించాడు. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పించి ఉంటే బాగుండేది కానీ విష్ణు తన కొడుకు ముద్దు ముద్దు మాటలే కావాలన్నుకున్నారు తప్పు లేదు.
నెగటివ్ పాయింట్స్ లో అంటే సినిమాలో ఫస్టాఫ్ ల్యాగ్..తిన్నడి ప్రేమ, పెళ్లి, రొమాంటిక్ సన్నివేశాలు...అసలు పాయింట్ నుంచి డీవియేట్ చేసినట్లు అనిపించింది. మ్యూజిక్ కూడా స్టీఫెన్ దేవస్సీతో కాకుండా ఎవరైనా బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్లను తీసుకునుంటే బాగుండేదనిపించింది. స్టీఫెన్ ఇండివిడ్యూవల్ గా మంచి ఫర్ఫార్మర్ కావచ్చు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాను హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించిద. కీరవాణి, మణిశర్మ లాంటి వాళ్లైతే పూర్తి న్యాయం చేసే వాళ్లేమో. తెర మీద మంచి సన్నివేశం నడుస్తుంటుంది. సీన్ ఎలివేట్ చేయాల్సిన చోట మ్యూజిక్ కానీ RR కానీ తేలిపోయాయి. నిజంగా ఆర్ఆర్ ఈ సినిమాకు డ్రా బ్యాక్. లేదంటే ఇంకా మంచి సినిమా అనే టాక్ వచ్చేది అని నా ఫీలింగ్. బట్ రెండు పాటలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ మీద పెద్దగా ఖర్చు పెట్టకూడదనే న్యూజిలాండ్ వెళ్లినట్లున్నారు. గ్రాఫిక్స్ అవసరం లేకుండా ఫస్టాఫ్ అంతా నేచురల్ ఫీల్ ఉంటుంది సినిమా అంతా. బట్ క్లైమాక్స్ లో వీఎఫ్ఎక్స్ పైసా వసూల్. భలే బాగా చేశారు గ్రాఫిక్ వర్క్స్ అన్నీ. సో టోటల్ గా ఈ సినిమా మీదున్న ట్రోలింగ్స్ అన్నీ పక్కన పెట్టి కథ, నటన పరంగా చూస్తే ఓ మంచి సినిమా..నిజాయితీ ప్రయత్నం. కానీ మంచు విష్ణు ఈ సినిమా మీద పెంచిన హైప్, నా సినిమాకు నాకే టిక్కెట్లు దొరకలేదు లాంటి డైలాగులన్నీ నెగటివ్ చేస్తున్నాయి. కాస్త ఆ అతి తగ్గించుకుంటే కన్నప్ప లాంటి సినిమాకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది..ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి. ఓవరాల్ గా డీసెంట్, హానెస్ట్ ప్రయత్నం. ప్రభాస్, మంచు విష్ణుల యాక్టింగ్ కోసం థియేటర్ లో చూడొచ్చు. సినిమా చూసిన మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు ఈ సినిమా మంచు విష్ణుకు బాహుబలి అని నిజమే. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపించింది.





















