పునీత్ లెగసీ ఎప్పటికి అలాగే కొనసాగాలన్న హీరో Vishal
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా , ప్రముఖ సినీ నటుడు విశాల్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ... కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక నేటితో తీరిందని,ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు.. దీపావళి సందర్భంగా ఎనిమి సినిమా విడుదల చేయనున్నాంమని, మా సినీమా కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయాం, అన్నయ్య సంకల్పం ఆగి పోకూడదు అని కోరుకున్నాని తెలిపారు.. పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని నేను చదివిస్తానని,నేను మరో ఇల్లు కొనుకోవాలని అనుకున్న కానీ ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు, కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు..పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారని విశాల్ గుర్తు చేశారు.