Nithiin Thammudu Movie Review | తమ్ముడు..హాల్ కి వచ్చిన వాళ్లతో లెట్స్ డూ కుమ్ముడూ | ABP Desam
తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో నితిన్ డైలాగ్ ఒకటే. సినిమా హిట్టయ్యాక మాట్లాడతా. రాబిన్ హుడ్ సినిమా డిజాస్టర్ కావటంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో అతిగా మాట్లాడేశానని..కానీ తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో తను పెద్దగా మాట్లాడనని..సినిమా సక్సెస్ మీట్ జరిగితే అప్పుడు మాట్లాడతానని చెప్పాడు. మరి తమ్ముడు సినిమా నితిన్ కు మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఇచ్చిందా..ఈ రివ్యూలో చూద్దాం.
కథ పరంగా చాలా పాత పాయింట్. వైజాగ్ లో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి చాలా మంది చనిపోతారు. అయితే ఆ పేలుడు కు కారణమైన వ్యక్తి మంత్రులను, ఆఖరకు సీఎంను కూడా ఓ రేటు కట్టి కొనేసి...ప్రమాదంలో చనిపోయిన వాళ్లకు రెండేసి లక్షలు పరిహారం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తాడు. ప్రభుత్వం కూడా ఆ కంపెనీ యజమాని తప్పేం లేదన్నట్లుగా నిజనిర్ధారణ కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలన్నది విలన్ పెట్టే షరతు. బట్ ఆ కమిటిలో ఉండే ఓ హానెస్ట్ ఆఫీసర్ ఆ సంతకం విలన్ కి అనుకూలంగా కాకుండా... అసలు వాస్తవాలు బయటపెట్టేలా సంతకం పెడతానంటుంది. ఆమెతో సంతకం పెట్టించుకునేందుకు విలన్ ఏం ప్లాన్ చేశాడు. మధ్యలో ఆ ఆఫీసరు తమ్ముడు తన అక్కను ఆమె కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడు...అక్కా తమ్ముళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏంటీ అనేదే తమ్ముడు సినిమా కథ.
కథ గా చూసినా పాతదే..ట్రీట్మెంట్ అంత కంటే పాతగా ఉంది. ఇంటర్నేషనల్ ఆర్చర్ అయిన మన నితిన్..తన అక్క గా నటించిన లయ కోసమే ఈ కథంతా తిరుగుతూ ఉంటుంది. సినిమాలో రకరకాల ఎమోషనల్ సీన్స్ రాసుకున్నారు. కానీ ఏవీ కనెక్టింగ్ గా అనిపించవు. అసలు కథతో చూసే ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా ఏమీ రాసుకోలేకపోయారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇలాంటి లైన్ తోనే వదిన- మరిది కాన్సెప్ట్ తో MCA సినిమా తీసిన వేణు శ్రీరామ్..ఈసారి అక్క తమ్ముళ్ల కథను అలా ప్రేక్షకులకు కనెక్ట్ చేయటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫైట్స్ వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ చూడటానికి బాగానే డిజైన్ చేశారు అనిపించినా...కోర్ ఎమోషన్ మిస్సవటంతో ఆడియెన్స్ ఎంగేజ్ అవటం కష్టం. అనుగచ్ఛతు ప్రవాహ అనే సంస్కృత శ్లోకాన్ని సినిమాలో మాట్లాడితే మాట్లాడారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదే. దాని అర్థం గో విత్ ద ఫ్లో అని. కానీ సినిమా కథనంలో మాత్రం ఆ ఫ్లో మిస్ అయ్యింది. సెకండాఫ్ లో ఓ అడవిలో చిక్కుకుపోతాం ఇకంతే తమ్ముడు సినిమా పేరు చూసి వచ్చినోళ్లందరినీ థియేటర్లో పడేసి లెట్స్ డూ కుమ్ముడూ అన్నట్లు ఉంటుంది.
సినిమాలో పాజిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. విలన్ అజర్వాల్ క్యారెక్టర్ డిజైన్ బాగుంది. సౌరభ్ సచ్ దేవ్ కూడా భలే సూట్ అయ్యారు. బాగా చేశారు. కానీ తను క్రియేట్ చేసిన క్యారెక్టర్ ను డైరెక్టర్ వేణుశ్రీరామ్ వాడుకోలేకపోయారని అనిపించింది. లయ, నితిన్ ఇద్దరూ అక్కా తమ్ముళ్ల తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. వర్ష బొల్లమ్మ ను చూస్తున్నామో నందమూరి బాలకృష్ణను చూస్తున్నామో అర్థం కాదు. కాంతార ఫేమ్ సప్తమీ గౌడ క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ని మాత్రం అప్రిషియేట్ చేయాలి. డల్ గా ఉన్న సినిమాను ఆయనే కొంచెం ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు తన బీజీఎంతో. సో ఓవరాల్ దిల్ రాజు, శిరీష్ లు ఈ సినిమా ప్రమోషన్స్ లో గేమ్ ఛేంజర్ కాంట్రవర్సి చుట్టూ తిరిగితే..తమ్ముడు సినిమా మాత్రం ఎటెటో తిరిగి బిలో యావరేజ్ గా ఎండ్ అయ్యింది. సో ఎల్లమ్మ వరకూ నితిన్ సైలెంట్ ఉండక తప్పదు.





















