Bheemla Nayak Update: భీమ్లానాయక్ ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..
భీమ్లా నాయక్` అప్ డేట్ అనే మాట వింటే చాలు నెటిజన్లు ఫుల్ హుషారైపోతున్నారు. అది పోస్టర్ అయినా, ఫస్ట్ గ్లింప్స్ అయినా, సాంగ్స్ అయినా... పవన్-రానా అభిమానులు క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. భీమ్లా పాత్రలోకి పవన్, డేనియల్ పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే ఆ ఇద్దరి లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. వీరిద్దరి మోషన్ పోస్టర్లు దూసుకెళ్లాయి. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక దీపావళి సందర్భంగా ఏం కానుక ఇస్తారో అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు మందు బాటిల్ తో కిక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు పవర్ స్టార్. ఒకరోజు ముందుగానే దివాలీ కానుక అందించేందుకు సిద్ధమైంది మూవీ యూనిట్.





















