Chiranjeevi Injury: చిరంజీవి చేతికి గాయం.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ఎంతో మందికి సేవ చేసినందుకు వాటి ఇన్‌చార్జ్‌లను కలిసి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి కుడిచేతికి కట్టుతో రావడం చర్చనీయాంశం అయింది. చిరంజీవి చేతికి ఏం అయింది అంటూ ఫ్యాన్స్ ట్వీటర్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరి సేవలను గుర్తించిన మెగాస్టార్.. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో తెలంగాణలోని అభిమానులతో భేటీ అయ్యారు.





















