Revanth Reddy Profile: అంతా తానై నడిపించిన అధ్యక్షుడు.. ఇక పీఠం అధిరోహించడమే బాకీనా..?
అడవికి రాజైన సింహం వేటాడాలంటే ఒంటరిగా వెళ్లదు.. గుంపులుగా వెళ్తాయి. కానీ పులి అలా కాదు... సింగిల్ గానే వేటాడుతుంది. ఇది అడవిలో టైగర్ ప్రత్యేకత. టైగర్ అని దగ్గరివాళ్లు ప్రేమగా పిలుచుకునే అనుముల రేవంత్ రెడ్డి రాజకీయాలూ అంతే. దూకుడైన స్వభావం.. పదునైన మాటలతో రాజకీయరంగంలోకి దూసుకొచ్చిన నేటితరం నేత రేవంత్ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో వేగంగా ఎదిగిన నేతగా ఆయన. ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడిగా ఉన్న కేసీఆర్ ను దూకుడుగా ఎదుర్కొన్న నేత రేవంత్ రెడ్డి. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది.




















