![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Naidu Family Winning Celebrations | AP Elections Counting | గెలుపు సంబరాల్లో చంద్రబాబు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. దీంతో.. చంద్రబాబు ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులంతా కూటమి విజయోత్సవాల్లో మునిగిపోయారు
రాజధాని ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలని నమోదు చేశారు. కృష్ణా జిల్లాలోని పామర్రు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈ జిల్లాలోని అవనిగడ్డలో జనసేన పోటీ చేయగా, ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని నమోదు చేశారు. అలాగే, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఈ జిల్లాలో విజయవాడ వెస్ట్ నుంచి బిజెపి అభ్యర్థి విజయం సాధించగా, మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని నమోదు చేశారు. తెనాలి నుంచి జనసేన విజయం సాధించగా, మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు.
![KA Paul Fires on Chandrababu Naidu | చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ కేఏ పాల్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/79bc3afa8896a756f7555f0ae1cb26e31717769407575252_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![YS Jagan Will Come To Assembly or Not | వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/7f255a4e2329751bd72dd7f21da8ab591717765432612252_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Thopudurthi Prakash Reddy Interview | తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో ఏబీపీ ఫేస్ టు ఫేస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/fc63c5010a2edebab39ed9decf388a261717684517413953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gorantla Madhav Face to Face With ABP | గోరంట్ల మాధవ్‌తో ఏబీపీ ఫేస్ టు ఫేస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/ce166bcd67547a1a7662749e8df799271717684150640953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sunkara Padmasree Fires on YS Sharmila | వైఎస్ షర్మిలపై సుంకర పద్మశ్రీ ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/0302316b70a0fbfe3c6b97452082c7311717682628157953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)