అన్వేషించండి
TTD Chairman : ఈనెల 31న తిరుపతి వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో గో మహాసమ్మేళన కార్యక్రమం
ఈనెల 31న గో మహాసమ్మేళన కార్యక్రమాన్ని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మాట్లాడిన ఆయన ప్రాచీనకాల సంప్రదాయమైన గో ఆధారిత నైవేద్యాన్ని మే నెల నుంచి స్వామి వారికి నిరాటంకంగా నివేదిస్తున్నామన్నారు. గో ఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. స్వామి వారికి ప్రారంభించిన నవనీత సేవ కోసం అవసరమయ్యే వెన్నను తిరుమలలోని గోశాలలోనే తయారు చేస్తున్నామన్నారు. గోశాల విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
వ్యూ మోర్





















