Samantha Tirumala visit: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి సమంత శనివారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లుంచుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ప్రముఖ సినీనటి సమంత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరున్ని శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమంతకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి మండపంలో వేద పండితులచే ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.





















